అన్వేషించండి

Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - మహేష్ బాబుకు జక్కన్న కండీషన్స్, ఇక కష్టమే!

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కబోతున్నది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కు జక్కన్న ఓ కండీషన్ పెట్టారట. దానికి ఓకే చెప్పిన ప్రిన్స్ రెండేళ్ల పాటు బయటకు కనిపించడని తెలుస్తోంది.

Rajamouli Condition For Mahesh Babu: రాజమౌళితో మూవీ అంటే మూమూలుగా ఉండదు. ఆయనతో సినిమా చేస్తే ఊహించని స్థాయిలో క్రేజ్ లభిస్తుంది. కెరీర్ ఫుల్ స్వింగ్ తో దూసుకెళ్లాల్సిందే! కానీ, ఆయనతో సినిమా చేయాలంటే బోలెడు ఓపిక అవసరం. సినిమా ఎప్పుడు మొదలవుతుందో? ఎప్పుడు పూర్తవుతుందో? ఎప్పుడు విడుదలవుతుందో? చెప్పడం కష్టం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ఓపికను పరీక్షించుకోబోతున్నారట. వీరిద్దరి కాంబోలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన  పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్ర్కిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

మహేష్ బాబుకు రాజమౌళి కండీషన్

ఈ సినిమా కోసం మహేష్ బాబుకు రాజమౌళి ఓ కండీషన్ పెట్టారట. ఈ మూవీకి సంబంధించి మహేష్ లుక్ ఎలా ఉండబోతోంది? అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రివీల్ కాకుండా ఉండాలని చెప్పారట. సినిమా షూటింగ్ మొదలుకొని, షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు బయటకు కనిపించకూడదన్నారట. తన లుక్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏవీ బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పారట. ఇందుకోసం అవసరం అయిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. కష్టమే అయినా, సరే అన్నారట మహేష్ బాబు.

రెండేళ్ల పాటు మీడియాకు, సోషల్ మీడియాకు దూరం

ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నారు. బాడీని పూర్తి స్థాయిలో మార్చుకోబోతున్నారు. జిమ్ లో గంటల తరబడి గడుపుతున్నారు. కఠినమైన డైట్ ప్లాన్ ను కూడా ఫాలో అవుతున్నారు. తన ఫిట్ నెస్ కోసం ఏకంగా ఇంటర్నేషనల్ ట్రైనర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారట. మహేష్ బాబు బాడీ కాకుండా, లుక్స్ కూడా ఈ సినిమాకు అనుగుణంగా మార్చుతున్నారట రాజమౌళి. తన జుట్టును కూడా సరికొత్తగా చూపించబోతున్నారట. అందుకే, ఆయన లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట రాజమౌళి. తన సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.

జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్!

వాస్తవానికి రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదంటే మే నుంచి ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారట. ఇండియానా జోన్స్ తరహాలో ఉండబోయే ఈ సినిమా షూటింగ్ దాదాపు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు మహేష్ మీడియాతో పాటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించనున్నారు. కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

Read Also: ‘సుందరం మాస్టర్’ to ‘ఆర్టికల్ 370’ - ఈ రోజు, రేపు సందడి చేయనున్న సినిమాలు, సీరిస్‌లు ఇవే!

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget