అన్వేషించండి

Sensational Sankranthi Hits: అప్పుడు ‘అరుంధతి’, ఇప్పుడు ‘హనుమాన్’ - 15 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్!

Sensational Sankranthi Hits: ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘హనుమాన్’ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

Sensational Sankranthi Hits: టాలీవుడ్​లో సంక్రాంతి అంటే సినిమా పండుగగా భావిస్తుంటారు. తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు తరలి వచ్చే అతి పెద్ద సీజన్ కావడం, కంటెంట్ ఎలా ఉన్నా అంతో ఇంతో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ అదే టైంలో రావాలని కోరుకుంటారు. ఎన్ని దొరికితే అన్ని థియేటర్లలో తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అయితే పొంగల్ బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు సంచలనాలు జరుగుతుంటాయి. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా వచ్చిన కొన్ని చిత్రాలు ఎవరూ ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తుంటాయి. అలాంటి మ్యాజిక్కే దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో రిపీట్ అయింది.

సంక్రాంతి పోరు ఎంత రసవత్తరంగా ఉంటుంది.. థియేటర్ల కోసం ఎలాంటి ఫైట్ నడుస్తుంది అనేది మనం ఈసారి కూడా చూశాం. అయితే కంటెంటే కింగ్ అని, కంటెంట్ బాగుంటే సినిమాను ఎవ్వరూ ఆపలేరని 2024 ఫెస్టివల్ సీజన్ మరోసారి నిరూపించింది. చిన్న సినిమాగా వచ్చిన 'హను-మాన్' బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని పొంగల్ విన్నర్ గా నిలిచింది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 'సంక్రాంతి సినిమా'గా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ 'హనుమాన్'. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్‌ బాబు, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటుగా రిలీజైంది. తొలి రోజు నుంచే వాటికి గట్టి పోటీ ఇవ్వటమే కాదు, బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ డామినేషన్ చూపించింది. తెలుగులో రాష్ట్రాల్లోనే కాదు, విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఇప్పటికీ అదే దూకుడు కంటిన్యూ చేస్తూ వస్తోంది. 

Also Read: 69th Filmfare Awards 2024: 'యానిమల్', 'జవాన్' చిత్రాలకు రెండేసి ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

'హనుమాన్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 270 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి చిత్రంగా ఉండగా, ఇప్పుడు హనుమాన్ సినిమా దాన్ని బీట్ చేసి టాప్ లో నిలిచింది. ఇక నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా భావించే 'పెద్ద పండగ' సీజన్ లో ఒక చిన్న హీరో సినిమా ఇలాంటి బెంచ్ మార్క్ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా అభివర్ణించవచ్చు.

సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్స్... 

ఇప్పుడు 'హనుమాన్' మాదిరిగానే సరిగ్గా 15 ఏళ్ళ క్రితం 'అరుంధతి' సినిమా కూడా సంచలన విజయం సాధించింది. అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ హారర్ ఫాంటసీ మూవీ తెరకెక్కింది. 2009 సంక్రాంతి కానుకగా జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ విమెన్ సెంట్రిక్ సినిమా.. స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది. రూ. 13 కోట్ల బడ్జెట్ తో తీస్తే, రూ. 70 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ ఫిగర్స్ ఈరోజుల్లో తక్కువగా అనిపించొచ్చు కానీ, ఆ సమయంలో ఇది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటి. ప్రస్తుతం అందరూ 'హనుమాన్' గురించి ఎలా మాట్లాడుకున్నారో, అప్పుడు 'అరుంధతి' గురించి కూడా అలానే మాట్లాడుకున్నారు. ఈ చిత్రం పది నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డులతో సహా అనేక అవార్డులు రివార్డులు అందుకుంది. మరి రానున్న రోజుల్లో తెలుగులో ఇంకెన్ని సంక్రాంతి సెన్సేషనల్ హిట్స్ వస్తాయో చూడాలి. 

Also Read: KGFను క్రాస్ చేసిన 'హను-మాన్'... హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 డబ్బింగ్ సినిమాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Common Used Passcodes: 2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
Embed widget