Caste Census : దేశవ్యాప్తంగా కులగణన- కేంద్రమంత్రి మండలి సంచలన నిర్ణయం
Caste Census:దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుంది. మరిన్ని కీలకాంశాలపై క్లారిటీ ఇచ్చింది.

Caste Data Will Be Included in Upcoming Census Centre: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయించింది. జనాభా లెక్కలతోపాటే ఈ కులగణన చేయనుంది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. వివిధ మార్గాల్లో సర్వేలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని కేంద్రం భావిస్తోంది. అందుకే జనాభా లెక్కల్లో ఈ అంశాన్ని చేరుస్తున్నట్టు స్పష్టం చేసింది. దీని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడు... కులాల అసలు సంఖ్య జనాభా లెక్కల్లో తేలుతుందని అన్నారు. అందుకే జనాభా లెక్కలతో చేపట్టాలని నిర్ణయించాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల్లో కులగణన చేశారు. కానీ వాటి లెక్కల్లో చాలా తేడాలు ఉన్నాయి. అసలు లెక్క తేలాలంటే మాత్రం జనాభా లెక్కలతోనే సాధ్యమవుతుదంని అభిప్రాయపడ్డారు.
जातीय जनगणना, मूल जनगणना में ही समाहित होगी. मोदी सरकार की कैबिनेट मीटिंग में फैसला हुआ है.
— Gaurav Shyama Pandey (@Gauraw2297) April 30, 2025
कैबिनेट मीटिंग के बाद हो रही ब्रीफिंग में लोग पाकिस्तान पर जवाबी कार्रवाई का इंतजार कर रहे थे. खैर, pic.twitter.com/jLHGccmdYQ
ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాలపై కేంద్ర కమిటీ (CCPA) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీల, NDA మిత్రపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదే పదే సమగ్ర కుల ఆధారిత జనాభా గణన కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఆ వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాలంటే ఇది అవసరం అని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. దేశంలో 2011లో పూర్తి స్థాయిలో జనాభా లెక్కింపు జరిగింది. తర్వాత COVID-19 మహమ్మారి, సహా ఇతర కారణాలతో 2021లో జరగాల్సిన జనాభా గణన వాయిదా పడింది. కొత్త జనాభా లెక్కింపు విషయాన్ని కేంద్రం వాయిదా వేస్తూ వస్తోంది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ , కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో కుల గణనను వ్యతిరేకించాయని అన్నారు. "1947 నుంచి కుల గణన జరగలేదు. కాంగ్రెస్ కుల గణనకు బదులుగా కుల సర్వే నిర్వహించింది. యుపిఎ ప్రభుత్వంలో, అనేక రాష్ట్రాలు రాజకీయ కోణంలోనే కులసర్వే చేశారు." అని ఆయన అన్నారు.
మోదీ ప్రభుత్వం కుల గణనను నిర్వహిస్తుంది- అశ్విని వైష్ణవ్
"కుల గణనను అసలు జనాభా గణనలో చేర్చాలి. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని రాజకీయ వ్యవహారాల మంత్రివర్గం రాబోయే జనాభా గణనలో చేర్చడం ద్వారా కుల గణన చేయాలని నిర్ణయించింది" అని కేంద్ర మంత్రి అన్నారు. కాంగ్రెస్, ఇండీ కూటమి తమ సొంత ప్రయోజనం కోసం మాత్రమే కుల గణన చేస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తదుపరి జనాభా గణనతోపాటు కుల గణనను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
చెరకు రైతులకు గుడ్ న్యూస్
మోదీ ప్రభుత్వం చెరకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పంది. చెరకు ఎఫ్‌ఆర్‌పిని పెంచారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "2025-26 చక్కెర సీజన్‌కు చెరకు న్యాయమైన, లాభదాయక ధర క్వింటాకు రూ.355గా నిర్ణయించాం. ఇది బెంచ్‌మార్క్ ధర, దీని కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయలేరు."
షిల్లాంగ్ నుంచి సిల్వర్ కారిడార్‌కు ఆమోదం
షిల్లాంగ్ నుంచి సిల్వర్ కారిడార్‌కు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మేఘాలయ నుంచి అసోంకు కొత్త రహదారి నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇది 166.8 కి.మీ. పొడవైన 4-లేన్ల రహదారి అవుతుంది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,"ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. మేఘాలయ, అసోంలను కలిపే సిల్చార్ నుంచి షిల్లాంగ్, షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు చాలా పెద్ద ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించింది. దీని అంచనా వ్యయం రూ. 22,864 కోట్లు." అని వివరించారు.





















