HanuMan Hindi Collections: KGFను క్రాస్ చేసిన 'హను-మాన్'... హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 డబ్బింగ్ సినిమాలివే!
HanuMan Hindi Collections: మూడో వారంలోనూ 'హను-మాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. హిందీ వెర్షన్ KGF నెట్ వసూళ్లను అధిగమించింది.
HanuMan Hindi Collections: సంక్రాంతికి చిన్న సినిమాగా థియేటర్లోకి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం 'హను-మాన్'. తేజ సజ్జా హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. తెలుగు స్టేట్స్ లోనే కాదు, పాన్ ఇండియా వైడ్ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. మూడో వారంలోనూ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయే రీతిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో $ 5 మిలియన్లకు పైగా వసూళ్లతో, ఆల్ టైమ్ టాప్-5 హయ్యెస్ట్ గ్రాసర్స్ గా నిలిచింది. ఇప్పుడు లేటెస్టుగా హిందీలో KGF కలెక్షన్లను క్రాస్ చేసింది.
'హను-మాన్' సినిమా నార్త్ లో ఊహించని విధంగా పెర్ఫార్మ్ చేస్తోంది. రూ. 2 కోట్లతో ప్రారంభించి, రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వస్తోంది. రూ. 50 కోట్ల మార్క్ కు అతి దగ్గరగా చేరుకుంది. హనుమాన్ హిందీ వెర్షన్ ఆదివారం నాటికి రూ. 44.5 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రూ. 44 కోట్లు రాబట్టిన 'కేజీఎఫ్' చాప్టర్-1 హిందీ డబ్బింగ్ వెర్షన్ ను క్రాస్ చేయడమే కాదు, అత్యధిక వసూళ్లు అందుకున్న హిందీ డబ్బింగ్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.
దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా హిందీ వెర్షన్ అత్యధికంగా ₹ 512 కోట్ల వసూళ్లు రాబట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది. అదే జక్కన్న దర్శకత్వంలో వచ్చిన RRR మూవీ ₹ 277 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, ప్రశాంత్ నీల్ రూపొందించిన KGF చాప్టర్-2 చిత్రం ₹ 434 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. '2.0', 'సలార్', 'సాహో', 'బాహుబలి', 'పుష్ప: ది రైజ్', 'కాంతారా', KGF చాప్టర్-1, 'కార్తికేయ 2' సినిమాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు 'హను మాన్' మూవీ కూడా ఈ జాబితాలో చేరింది.
* హిందీలో అత్యధిక కలెక్షన్స్ (నెట్) సాధించిన సౌత్ డబ్బింగ్ సినిమాలు...
• బాహుబలి - ₹ 512 కోట్లు
• కేజీయఫ్ 2 - ₹ 434 కోట్లు
• ఆర్.ఆర్.ఆర్ - ₹ 277 కోట్లు
• రోబో 2.0 - ₹ 199 కోట్లు
• సలార్ - ₹ 154 కోట్లు
• సాహో - ₹ 147 కోట్లు
• బాహుబలి 1 - ₹ 119 కోట్లు
• పుష్ప 1 - ₹ 108 కోట్లు
• కాంతారా - ₹ 79 కోట్లు
• హనుమాన్ - 45 కోట్లు (Running)
• కేజీయఫ్ 1 - ₹ 44 కోట్లు
• కార్తికేయ 2 - ₹ 34 కోట్లు
* హిందీలో అత్యధిక వసూళ్లు (నెట్) రాబట్టిన టాప్-10 తెలుగు డబ్బింగ్ సినిమాలు...
1. బాహుబలి - ₹ 512 కోట్లు
2. ఆర్.ఆర్.ఆర్ - ₹ 277 కోట్లు
3. సలార్ - ₹ 154 కోట్లు
4. సాహో - ₹ 147 కోట్లు
5. బాహుబలి 1 - ₹ 119 కోట్లు
6. పుష్ప 1 - ₹ 108 కోట్లు
7. హనుమాన్ - ₹ 45 కోట్లు (Running)
8. కార్తికేయ 2 - ₹ 34 కోట్లు
9. రాధేశ్యామ్ - ₹ 23 కోట్లు
10. లైగర్ - ₹ 21 కోట్లు
Also Read: ఇది రామ కోటి కాదు... రామభక్తుడిని చూసేందుకు థియేటర్లకు తరలివచ్చిన కోటి!