YS Jagan News: సింహాచలం దుర్ఘటన బాధితులకు రూ.కోటి ఇవ్వాలి- లేకుంటే మేం ఆదుకుంటాం: జగన్
Simhachalam Incident:సింహాచలంలో జరిగిన దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు వైఎస్ జగన్. బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము వచ్చి ఆదుకుంటామన్నారు.

Simhachalam Incident: సింహాచలంలో గోడ కూలిన ఘటన బాధితులను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏడాదిలోనే ఇన్ని దారుణాలు చూస్తామని అనుకోలేదన్నారు. నాడు తిరుమలల వైకుంఠ ఏకాదశి నాడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆరుగురి చావుకు కారణమయ్యారని ఇప్పుడు సింహాచలంలో కూడా అదే రిపీట్ అయ్యిందని మండిపడ్డారు.
ప్రజలు, భక్తులు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చందనోత్సవం జరుగుతుంది... భక్తులు భారీగా తరలివస్తారని ప్రభుత్వానికి ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పనలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
రెండు రోజుల ముందు గోడ నిర్మించడం ఏంటీ?
చందనోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారో ముందుగానే తెలిసినా చివరి నిమిషంలో గోడ కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు జగన్. రెండుల కిందట పది అడుగుల ఎత్తు, డబ్బై అడుగుల పొడవు ఉన్నగోడని ఎలా నిర్మించారని నిలదీశారు. ఈ గోడ కట్టేందుకు కనీసం టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. అదైనా ముందే కట్టి ఉంటే ఇంతటి విపత్తు జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. చేసిన పనులు కూడా నాణ్యత చేయలేదని వర్షానికే గోడ కూలిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
#WATCH | Wall collapsed in Sri Varahalakshmi Narasimha Swamy temple in Visakhapatnam, former Andhra Pradesh CM Jagan Mohan Reddy says, "...It's also a well-known fact that lakhs of people, more than two lakhs people, have come to attend this occasion. This happens every year.… pic.twitter.com/XPZFjm9UV2
— ANI (@ANI) April 30, 2025
చంద్రబాబు తప్పిదమే ఇదంతా : జగన్
ఇంతటి ఘోరం జరిగిన వెంటనే తప్పును తమపై నెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. కాని వాళ్ల హయాంలోనే పనులు కేటాయించినట్టు తెలిసి సైలెంట్ అయిపోయారని అన్నారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేనికైనా సిద్ధపడతారని మండిపడ్డారు. నాడు పుష్కరాల నుంచి నేటి చందనోత్సవం వరకు జరిగిన దుర్ఘటనల్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వం ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింహాచలంలో బుర్రలేకుండా @ncbn ప్రభుత్వం గోడను కట్టారు
— YSR Congress Party (@YSRCParty) April 30, 2025
గోడ కూలిపోయే ముందు ఫ్లెక్సీ లాగా ఊగిందట
మానవతా దృక్పథంతో బాధితులకి కోటి రూపాయలు ఇచ్చి చంద్రబాబు ఆదుకోవాలి
-@ysjagan గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు#YSJagan#SaveDevoteesFromTDP #CBNFailedCM#SaveSimhachalamFromTDP… pic.twitter.com/EwNYy3sAuR
బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలి: జగన్
ఇప్పుడు జరిగిన దుర్ఘటనలో కూడా తాను వస్తున్నానని చెప్పిన తర్వాత పాతిక లక్షల పరిహారం ప్రకటించారని జగన్ ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా జరిగిన దుర్ఘటన కాబట్టి పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఇలాంటివి జరిగితే మానతాదృక్పథంతో పరిహారం సక్రమంగా అందజేశామన్నారు జగన్. ఇప్పుడు కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింహాచల చందనోత్స దుర్ఘటనలో బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటే రిపీట్ కాకుండా ఉంటాయని జగన్ సూచించారు.





















