News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tollywood: మన హీరోలు ఏజ్ కు తగ్గ వేషాలు వేయాల్సిన టైమొచ్చిందా?

టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇకపై తమ వయసుకు తగ్గ పాత్రల్లో నటించాలనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. రజినీ కాంత్, కమల్ హాసన్ లను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

మన సూపర్ సీనియర్ హీరోలు ఏజ్ కు తగ్గ పాత్రలు చెయ్యాల్సిన టైమొచ్చిందా? యంగ్ హీరోయిన్లు, ఐటమ్ సాంగ్ లు పక్కన పెట్టి కథా బలమున్న సినిమాల్లోనే నటించాలా?. ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఇవే అంశాల మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్.. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్.. కన్నడలో శివ రాజ్ కుమార్ లాంటి హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలను, కథలను ఎంచుకొని హిట్లు కొడుతున్నారు. 'విక్రమ్' 'భీష్మ పర్వం' 'మఫ్టీ'.. లేటెస్టుగా 'జైలర్' సినిమాలు ఇలా వచ్చినవే. కానీ కొందరు టాలీవుడ్ హీరోలు, బాలీవుడ్ స్టార్లు మాత్రం ఇప్పటికీ తమ కూతురు వయసున్న హీరోయిన్లతో ఆడిపాడటానికి ఆసక్తి కనబరుస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆరు పదుల వయసు దాటేసినా ఇంకా కుర్ర భామలతో రొమాన్స్ చేయాలని కోరుకుంటున్నారని, వారి పక్కన యంగ్ గా కనిపించడానికి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారని ట్రోలింగ్ చేస్తున్నారు.  

'జైలర్' సినిమా తీసుకుంటే, అందులో రజినీది తాత క్యారెక్టర్. నెరసిన జుట్టు, మాసిన గడ్డంతో చాలా సాదా సీదాగా కనిపించే పాత్ర ఆయనది. 'విక్రమ్' లో కమల్ కూడా తాత పాత్రలో నటించారు. అదే సమయంలో చిరంజీవి, బాలయ్యలు మాత్రం 'వాల్తేరు వీరయ్య' 'వీర సింహారెడ్డి' సినిమాలలో కమల్ కూతురు శృతి హాసన్ తో డ్యూయెట్లు పాడుకున్నారు. ఐటమ్ గర్ల్స్ తో చిందులేశారు. ఇప్పుడు 'భోళా శంకర్' లో తమన్నాతో స్టెప్పులేశారు చిరు. ఈ నేపథ్యంలోనే కమల్, రజినీల మాదిరిగా మన సీనియర్ హీరోలు ఎందుకు వయసుకు తగిన పాత్రలు చేయడం లేదు? ఎందుకు ఇంకా ఇంకా తమ ఏజ్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా వయసుకు తగ్గ వేషాలు వేస్తే బాగుంటుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇస్తున్నారు.

హిందీ హీరోల సంగతి పక్కన పడితే, నిజానికి మన సూపర్ సీనియర్ హీరోలు కొన్నిసార్లు బయటకి వచ్చి ప్రయోగాలు చేసారు. తాత పాత్రలు చేయకపోయినా, తమ వయసుకు తగ్గ వేషాలే వేశారు. కానీ ఆడియన్స్ ఆ సినిమాలను రిజెక్ట్ చేసారు. 63 ఏళ్ళ వయసులోనూ ఎంతో ఫిట్ గా ఉంటూ, ఇప్పటికీ 'మన్మథుడు' అని పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున.. గత కొన్నేళ్లుగా తన ఏజ్ కు సూట్ అయ్యే పాత్రలే చేస్తున్నారు. అయితే 'బంగార్రాజు'తో హిట్ కొట్టారు కానీ.. యునిక్ కాన్సెప్ట్స్ తో తీసిన 'వైల్డ్ డాగ్', 'ది ఘోస్ట్' సినిమాలతో ప్లాప్ అందుకున్నారు నాగ్.

Also Read: అర్థరాత్రి అప్డేట్ - ఇప్పుడిదే ఇండస్ట్రీలో నయా ట్రెండ్, ఎందుకలా?

అలానే ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన దగ్గుబాటి వెంకటేష్ కూడా చాలా ఏళ్ళ క్రితమే ట్రాక్ మార్చారు. 'నారప్ప', 'దృశ్యం 2' సినిమాలలో పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ముగ్గురు పిల్లలకు తండ్రిగా నటించారు. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ లో తాత రోల్ చేసారు. కానీ వీటికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఇప్పుడు 'సైంధవ్' సినిమాలో వెంకీ మరోసారి మిడిల్ ఏజ్డ్ క్యారక్టర్ లో కనిపించే ధైర్యం చేస్తున్నారు. 

ఇటీవల కాలంలో ఎక్కువగా డ్యూయల్ రోల్స్ చేస్తున్న మరో సీనియర్ హీరో బాలకృష్ణ.. సినిమాల్లో ఒక పాత్రను తన ఏజ్ కు తగ్గట్టుగా సెట్ చేసుకుంటున్నారు. యంగ్ గా కనిపించే రెండో పాత్ర ఎబ్బెట్టుగా అనిపించించినప్పటికీ.. 'అఖండ' 'వీర సింహా రెడ్డి' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టారు. తన రాబోయే చిత్రంలో మాత్రం ఓ టీనేజ్ గర్ల్ కి తండ్రి పాత్రలోనే కనిపిస్తూ తనదైన ముద్రని చూపించబోతున్నారు. ఇక చిరంజీవి విషయానికొస్తే, రీమేక్ మూవీ 'గాడ్ ఫాదర్' లో మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా నటించారు. ఇందులో ఆయనకు హీరోయిన్ కూడా లేదు. అలానే 'ఆచార్య' చిత్రంలోనూ జోడీ లేదు. కానీ ఇవి రెండూ ఆశించిన విజయాలను అందుకోలేదు. అదే సమయంలో శృతి హాసన్ తో కలిసి చేసిన 'వాల్తేరు వీరయ్య' సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  

ఇలా మన నలుగురు సీనియర్ హీరోల ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే.. వారు తమ వయసుకు తగ్గ పాత్రలు చేసినప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేసే కమర్షియల్ సినిమాలను హిట్ చేసారు. అందుకే వారు అలాంటి చిత్రాలను ఎంచుకుంటున్నారని ఓ వర్గం సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, సరిగ్గా తీయలేదు కాబట్టే అవి ప్లాప్ అయ్యాయని అంటున్నారు. 'విక్రమ్' 'జైలర్' లాంటి సినిమాలు చేస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ చేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: 'హైదరాబాద్‌లో ల్యాండిస్తానంటే నవ్వా.. అండర్ వరల్డ్ మాఫియా వల్లే అక్కడికి వెళ్లలేదు'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 12 Aug 2023 10:11 AM (IST) Tags: Venkatesh Balakrishna Nagarjuna Akkineni Rajinikanth Shiva Rajkumar Mohanlal Kamal Haasan Mammootty Chiranjeevi Tollywood senior heroes

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !