అన్వేషించండి

Rahul Ramakrishna : తూచ్... నా కామెంట్స్​ను వెనక్కి తీసుకుంటున్నా... సంధ్య థియేటర్ ఘటనపై రాహుల్ రామకృష్ణ పోస్ట్ వైరల్

Rahul Ramakrishna : ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ తాజాగా తన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 Rahul Ramakrishna : 'పుష్ప 2' రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటు టాలీవుడ్, అటు రాజకీయాల పరంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వివాదం రోజురోజుకూ మరింత తీవ్రతరమవుతోంది. అయితే ఈ ఘటనపై కొంతమంది అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తుంటే, మరి కొంతమంది ప్రభుత్వం చేసిన పని కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది సెలబ్రిటీలు ఆయనకు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ వేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తూ గతంలో ట్వీట్ చేశారు. కానీ తాజాగా ఆయన తన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. 

కమిషనర్ వీడియో తర్వాత నిర్ణయం...

ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనను అవమానిస్తున్నారని, తను అలాంటి వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అలాగే అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. అయితే పోలీసులు రేవతి అనే మహిళ చనిపోయిందనే విషయాన్ని తనకు చెప్పలేదని అల్లు అర్జున్ ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆరోజు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన తన వైపు నుంచి వివరించారు. అయితే కమిషనర్ సివి ఆనంద్ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత రాహుల్ రామకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.  రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో "ఆరోజు జరిగిన ఘటన గురించి నాకు సరైన సమాచారం లేదు. కాబట్టి ఈ విషయంలో నేను చేసిన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నాను" అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతో కొంతమంది రాహు రామకృష్ణపై మండిపడుతుంటే, మరి కొంతమంది మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ పొగుడుతున్నారు. 

రాహుల్ రామకృష్ణ పోస్ట్... 
రాహుల్ రామకృష్ణ డిసెంబర్ 13న అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశారు. అందులో "సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరమే. అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతుందే కానీ, ఓ వ్యక్తి చేసిన తప్పు ఎలా అవుతుంది? సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. సినిమా స్థాయిని బట్టి ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతమంది ప్రజలు వస్తారని తెలిసినప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? అందరిని ఒకేసారి ఎందుకు అనుమతించారు? రాజకీయ పార్టీలు, మతపరమైన ఊరేగింపుల సమయంలో కూడా తొక్కిసలాట జరిగి కొంత మంది మరణిస్తారు. ఆ టైంలో ఇలా ఎందుకు స్పందించరు? సినిమా విషయంలో ఎందుకు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు? బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందేలా చేయాలి. అంతేకానీ ఈ ఘటనకి ఒక్కరినే బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు" అంటూ రాస్కొచ్చారు. ఇక ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా కామెంట్ చేశారు.

Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget