అన్వేషించండి

Box Office Collections: 2023లో బాక్సాఫీస్‌కు ప్రాణం పోసిన ముగ్గురు హీరోలు - ఏకంగా రూ.4300 కోట్ల వసూళ్లతో!

2023 Box Office Collections: 2023లో బాక్సాఫీస్ బాగానే కళకళలాడింది. ఇక దానికి ఎంతోమంది హీరోల సాయం కూడా ఉంది. కానీ ఆ ముగ్గురు హీరోలు ఒకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేసి బాక్సాఫీస్‌కు ప్రాణం పోశారు.

విడుదలయ్యే ప్రతీ సినిమా ప్రేక్షకులకు నచ్చాలని లేదు. అలా నచ్చని పరిస్థితుల్లోనే ఆ మూవీ ఫ్లాప్‌గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడి కనీసం కలెక్షన్స్ కూడా సాధించలేకపోతుంది. 2023లో విడుదలయిన సినిమాల్లో ఎన్నో సినిమాలు అలా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినవే. దాని వల్ల కొందరు స్టార్ హీరోలు కూడా ఫ్లాప్‌లను చవిచూశారు. ఇక గతేడాది ప్రేక్షకులను అలరించానికి వచ్చిన స్టార్ హీరోలలో ముగ్గురికే ఎక్కువగా బాక్సాఫీస్ క్రెడిట్స్ దక్కుతాయి. వారే షారుఖ్ ఖాన్, విజయ్, ప్రభాస్. ఈ ముగ్గురు సినిమాలే బాక్సాఫీస్‌కు ఎక్కువశాతం వసూళ్లు తెచ్చిపెట్టాయి.

ఏకంగా మూడు సినిమాలతో షారుఖ్..
టైర్ 1 హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టం. ఇక ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతుంది. కానీ బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ మాత్రం ఏకంగా మూడు సినిమాలను ఒకే ఏడాది విడుదల చేసి అందరికీ షాకిచ్చాడు. అందుకే 2023లో బాక్సాఫీస్ నెంబర్లు ఎక్కువగా షారుఖ్ పేరుపైనే ఉంటాయి. ముందుగా 2023 మొదట్లో ‘పఠాన్’తో థియేటర్లలో సందడి చేశాడు ఈ హీరో. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్’తో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. సౌత్ ఫ్లేవర్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కేవలం ‘జవాన్’, ‘పఠాన్’తోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ను సాధించాడు షారుఖ్. ఇక తాజాగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన ‘డంకీ’ కూడా విడుదలయ్యి.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 

‘ఆదిపురుష్’, ‘సలార్’లతో ప్రభాస్..
ముందుగా షారుఖ్ ఖాన్.. 2023లో ఎక్కువ బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన హీరోగా రికార్డ్ సాధిస్తే.. తన తరువాతి స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. ఈ హీరో కూడా చాలాకాలం తర్వాత ఒకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేశాడు. ముందుగా ‘ఆదిపురుష్’ చిత్రంతో 2023లో థియేటర్లలోకి ఎంటర్ అయ్యాడు ప్రభాస్. ఈ మూవీ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ అందుకున్నా కూడా వసూళ్ల విషయంలో మాత్రం పరవాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’.. రూ.370 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ విడుదలయ్యింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా.. రూ.500 కోట్ల మార్క్‌ను టచ్ చేసి ఇంకా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతూనే ఉంది.

‘వారిసు’, ‘లియో’లతో విజయ్..
షారుఖ్ ఖాన్, ప్రభాస్ తర్వాత 2023లో అత్యధిక బాక్సాఫీస్ వసూళ్ల రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు తమిళ స్టార్ విజయ్. ఈ హీరో కూడా గతేడాదిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముందుగా ‘వారిసు’తో ప్రేక్షకులను పలకరించాడు విజయ్. కానీ ఆ మూవీ అంతగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అయినా ‘ఆదిపురుష్’ తరహాలోనే బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో మాత్రం పరవాలేదనిపించింది. మొత్తంగా ‘వారిసు’.. రూ.290 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’తో సూపర్ హిట్ అందుకున్న విజయ్.. ఆ మూవీతో రూ.595 కలెక్షన్స్‌ను సాధించాడు. మొత్తంగా 2023లో విజయ్.. తన సినిమాలతో బాక్సాఫీస్‌కు రూ.900 కోట్ల కలెక్షన్స్‌ను తెచ్చిపెట్టాడు. షారుఖ్ ఖాన్, విజయ్, ప్రభాస్ కలిపి మొత్తంగా రూ.4300 కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫీస్‌కు ఊపిరిపోశారు.

Also Read: రకుల్ పెళ్లికి ముహూర్తం ఖరారు? ఆ తేదీన వెడ్డింగ్, బ్యాచిలర్ పార్టీ కోసం థాయ్‌ల్యాండ్ ప్రయాణం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
IPL 2025 RCB Retention List: ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
Babies Health : చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
Embed widget