అన్వేషించండి

Gandharvudu Jr: జూనియర్ ‘గంధర్వుడు’గా వస్తోన్న జనతా గ్యారేజ్ నటుడు!

'జనతా గ్యారేజ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్న ఫాంటసీ డ్రామా 'గంధర్వ Jr.' తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రో వీడియోని విడుదల చేసారు.

పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ మొదలైన తర్వాత భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ నచ్చితే చాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు.. బాక్సాఫీస్ విజయాలను అందిస్తున్నారు. అందుకే ఫిలిం మేకర్స్ అంతా ఏకకాలంలో అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు 'గంధర్వ జూనియర్' అనే బహు భాషా చిత్రం ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. 

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గంధర్వ Jr'. ఇది అతనికి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 6 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో దీన్ని ‘గంధర్వుడు జూనియర్’గా రిలీజ్ చేస్తున్నారు. గతేడాది ఉన్ని పుట్టిన రోజు (సెప్టెంబర్ 22) సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసి, టైటిల్ పోస్టర్ ఆవిష్కరించారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది హీరో బర్త్ డే స్పెషల్ గా మేకర్స్ లేటెస్టుగా ఫస్ట్ గ్లిమ్ప్స్ ను లాంచ్ చేసారు. 

'గంధర్వ జూనియర్' చిత్రాన్ని 'గంధర్వుడు Jr.' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. గంధర్వుల ప్రపంచం పేరుతో తాజాగా విడుదల చేసిన ఇంట్రో వీడియో సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో 'దేవతలు ప్రత్యక్షంగానో అవతారాల ద్వారానో చేసిన యుద్ధాలు ఈనాటికీ కొనియాడబడుతున్నాయి.. ఆ యుద్ధాలలో గంధర్వులు దేవతలకు తోడుగా నిలిచిన కథలు మరుగున పడిపోయాయి' అంటూ గంధర్వుల లోకాన్ని పరిచయం చేసారు.  

గంధర్వుల పోరాట పటిమ చూసి దేవతలు అసూయ పడినట్లు, వారి అందచందాలను చూసి భయపడిపోయినట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. దేవతల వలనే గంధర్వుల యుద్ధ పరాక్రమాలు సర్వ లోకాల మనస్సుల నుంచి, చరిత్ర నుంచి చెరిపివేయబడ్డాయని తెలిపారు. ఈ ప్రపంచం గంధర్వుల అందాన్ని సంగీత జ్ఞానాన్ని వర్ణించడం మొదలు పెట్టాయని, యుగాలకు ఇటు వైపు గంధర్వ పురాణం మళ్ళీ సృష్టించబడిందని తెలియజెప్పారు. అయితే ఇప్పుడు ఈ 'గంధర్వ జూనియర్' సినిమాలో ఒక గంధర్వ వీరుని కావ్య కథను చూడబోతున్నట్లుగా చెప్పారు. 

Also Read: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క పాటతో టైగర్ మాస్ ఏంటో చూపించేశారుగా!

వాయిస్ ఓవర్ తో గంధర్వ లోకాన్ని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటోంది. పురాణాల్లో గంధర్వులు, దేవతల మధ్య వైరం గురించి ప్రస్తావిస్తూ.. 'గంధర్వ Jr.' చిత్రంలో ఎలాంటి కథను చెప్పబోతున్నామనేది శాంపిల్ గా చూపించారు. ఇదొక ఫాంటసీ డ్రామా అని హింట్ ఇచ్చారు. విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కాకపోతే ఇందులో మోడరన్ గంధర్వుడుగా నటిస్తున్న హీరో ఉన్ని ముకుందన్ కంప్లీట్ లుక్ ని రివీల్ చేయలేదు. కేవలం అతని కళ్ళను మాత్రమే చూపించారు. 

'గంధర్వుడు Jr.' చిత్రానికి విష్ణు అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీణ్ ప్రభాకరన్, సుజిన్ సుజాతన్ రచనా సహకారం అందిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. లిటిల్ బిగ్ ఫిల్మ్స్ సమర్పణలో సువిన్ వార్కీ, ప్రశోభ్ కృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మలయాళ ఫాంటసీ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 
 
ఇకపోతే ఉన్ని ముకుందన్ 'జనతా గ్యారేజ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'భాగమతి' 'ఖిలాడీ' 'యశోద' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది ‘మాలికా పురం’ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 'గంధర్వ Jr.' చిత్రంతో పాన్ ఇండియాని టార్గెట్ చేయడానికి సిద్దమవుతున్నారు. మరి ఈ ప్రయత్నం మలయాళ హీరోకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Also Read: కుర్రాడిగా మారేందుకు నానా పాట్లు - జగ్గూ భాయ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Vijay Devarakonda Rashmika: రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Vijay Devarakonda Rashmika: రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget