By: ABP Desam | Updated at : 22 Sep 2023 09:55 AM (IST)
జగపతి బాబు (Image Credit: X)
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సీనియర్ యాక్టర్స్ లో విలక్షణ నటుడు జగపతిబాబు ఒకరు. చేతి నిండా సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉన్నా.. వీలు కుదిరినప్పుడల్లా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. అందరిలాగా కాకుండా కాస్త హ్యూమర్ జోడించి క్యాప్షన్లు పెట్టడం జగ్గూ భాయ్ ప్రత్యేకత. అందుకే ఆయన పోస్టుల కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగపతి సరికొత్త ఫోటోతో వచ్చారు.
ఇటీవల జగపతి బాబు పింక్ కలర్ అవుట్ ఫిట్స్ తో ఫొటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. లేటెస్టుగా షేర్ చేసిన పిక్ లో తన ఫేస్ ను టిష్యూ పేపర్ తో కవర్ చేసుకొని ఫన్నీగా కనిపించారు. "ఇంతకు ముందు ఇన్‌స్టాలో పింక్ డ్రెస్ లో ఉన్న ఫోటోను చూసి నన్ను కుర్రాడిలాగా ఉన్నానని మీరందరు చెప్పినాక యెచ్చులు ఎక్కువ అయిపోయాయి. నిజంగానే కుర్రాడిని అయిపోదామని నా మొహాన్ని రెడీ చేస్తున్నా'' అని జగ్గూ భాయ్ పోస్ట్ పెట్టారు.
Intaka mundhu insta lo Pink dress lo, kurradu laaga unnanu ani meerandharu cheppinnaka, yecchu ekkuvu ayipoyi, nijamga kurradini ayyipoddham ani mokkaani ready chesthunnanu.... pic.twitter.com/1atXaKFxtz
— Jaggu Bhai (@IamJagguBhai) September 20, 2023
జగపతి బాబు రీసెంట్ గా జుట్టుకు లైట్ గా కలర్ వేసుకొని, పింక్ కలర్ డ్రెస్సులో బార్బీ తరహాలో అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. "జుట్టుకి రంగు వేసుకునే రోజులు అప్పుడు ఈ రంగు బట్టలు వేసుకుంటే, వీడు ఆ టైప్ రా అన్నారు. ఇప్పుడు జుట్టుకి రంగు వేసుకుని, అదే రంగు బట్టలు వేసుకుంటే అదిరింది అంటున్నారు… ఏంటో ఈ అర్ధంకాని లోకం'' అని పోస్ట్ పెట్టారు. ఆ ఫోటోలకు నెటిజన్ల నుంచి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. జగ్గూ భాయ్ రోజు రోజుకి యంగ్ గా తయారవుతున్నారని కొందరు కామెంట్లు పెడితే, మరింత హ్యాండ్సమ్ గా ఉన్నారని మరికొందరు అన్నారు. అందుకే ఇప్పుడు నిజంగానే కుర్రాడిగా మారిపోవడానికి ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆరు పదుల వయసులో యంగ్ గా కనిపించడానికి సీనియర్ నటుడు పడుతున్న పాట్లు చూడండని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: రూ.400 కోట్లకు అమ్ముడైన ఆ సీనియర్ నటుడి ఇల్లు!
ఇక సినిమాల విషయానికొస్తే, 1989లో 'సింహ స్వప్నం'తో హీరోగా తెరంగేట్రం చేసిన జగపతిబాబు.. మూడు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ కథా చిత్రాలతో టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా తనదైన ముద్ర వేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతున్నాడు జగ్గూభాయ్. విలన్ గానే కాకుండా.. ఫాదర్, బ్రదర్ వంటి సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తున్నారు.
ఇటీవలే 'రుద్రాంగి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జగపతిబాబు.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' లో రాజమన్నార్ అనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారు. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాలోనూ జగ్గూ భాయ్ నటిస్తున్నారు.
Also Read: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క పాటతో టైగర్ మాస్ ఏంటో చూపించేశారుగా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>