The Raja Saab : ప్రభాస్ “రాజాసాబ్” షూటింగ్ మొదలు… సాంగ్స్ కోసం ఫారిన్లో స్పెషల్ లొకేషన్స్, గట్టిగానే ప్లాన్ చేసిన మారుతి
The Raja Saab Last Schedule : ప్రభాస్ ఫ్యాన్స్‌కి స్వీట్ న్యూస్. ఈరోజు నుంచి రాజాసాబ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. కేరళలో ఇంట్రడాక్షన్ సాంగ్ ప్లాన్ చేసిన మూవీ టీమ్.. గ్రీస్‌లో ఏమి ప్లాన్ చేసిందో తెలుసా?

The Raja Saab Shooting Update : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న రాజాసాబ్ చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి మొదలుకానుంది. ఈనెలాఖరు వరకు హైదరాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. భారీ సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్.. తర్వాత కేరళకు షిప్ట్ కానుంది. సెప్టెంబర్ 17 నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ (The Raja Saab Introduction Song) చిత్రీకరించనున్నారు.
యూరప్‌లో సాంగ్స్?
ఇండియాలో ఈ షూటింగ్ పూర్తి అయిన తర్వాత.. గ్రీస్‌లోని అందమైన ప్రదేశాల్లో రెండు పాటలను తెరకెక్కించనున్నారు. ప్రభాస్ అభిమానులకు ఈ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది. ఈ మొత్తం షెడ్యూల్ పూర్తి అయితే రాజాసాబ్ షూటింగ్ పూర్తి అవుతుంది.
భారీగా ఇంట్రడక్షన్ సాంగ్
ప్రభాస్ కెరీర్లో మరో మాస్ ఎంటర్టైనర్గా రాజాసాబ్ మూవీ నిలవబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్స్, టీజర్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తుంది. ప్రభాస్ యాక్షన్, స్టైలిష్ లుక్స్, డైలాగ్స్ బాగా హైలెట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇంట్రడక్షన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు మారుతి.

మారుతి డైరక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మారుతి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. రాజాసాబ్ టీజర్లో కూడా దానినే చూపించారు. సినిమా మొత్తం మంచి కథతో ఎంటర్టైన్మెంట్ ఇస్తే ప్రభాస్ ఖాతాలో మరో హిట్ కచ్చితంగా పడుతుంది. డిసెంబర్ 5, 2025న ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కానుంది.






















