అన్వేషించండి

Sir Madam OTT : ఓటీటీలోకి 'సార్ మేడమ్'.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

Sir Madam OTT Platform : పెళ్లైన కొత్తలో భార్యభర్తల మధ్య జరిగే గొడవలు విడాకులకు ఎలా దారితీశాయనే సెన్సిటివ్ అంశంతో తెరకెక్కిన సినిమా సార్ మేడమ్. ఈ సినిమా ఎందులో స్ట్రీమ్ అవుతుందంటే.. 

విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యామీనన్ (Nitya Menon) జంటగా నటించిన చిత్రం 'తలైవాన్ తలైవి (Thalaivan Thalaivii)'. దీనిని తెలుగులో 'సార్ మేడమ్ (Sir Madam)' పేరుతో విడుదల చేశారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్​కి టాలీవుడ్​లో మంచి గుర్తింపు ఉంది. పైగా వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్​పెక్టేషన్స్ పెరిగాయి. దానికి తగ్గట్లుగానే సెన్సిటివ్ కథాంశంతో సార్​ మేడమ్ సినిమాను తెరకెక్కించారు. థియేటర్​లో మంచి టాక్​ను అందుకొన్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే.. 

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'సార్ మేడమ్'

Sir Madam OTT Release Date And Platform : 'సార్​ మేడమ్' సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో సినిమాను విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం అవుతుంది. బాక్సాఫీస్ వద్ద తమిళంలో 75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేసింది.

సార్ మేడమ్..

పెళ్లైన కొత్తలో గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరి మధ్యలో.. కొన్ని నెలల్లోనే గొడవలు మొదలవుతాయి. ఇవి పెరిగి విడాకులకు దారితీస్తాయి. ఇదే కథ ఆధారంగా 'సార్ మేడమ్' సినిమాను రూపొందించారు. సినిమాలో విజయ్ సేతుపతిని, నిత్యా మీనన్ నువ్వా నేనా అన్నట్లు పర్​ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో వారి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. యోగి బాబు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని హైలెట్  చేసింది.

ఈ సినిమాలో కామెడీతో పాటు మంచి ప్రేమకథకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేశాడు డైరక్టర్ పాండిరాజ్. భార్యాభర్తల మధ్య సమస్యలను హాస్యభరితంగా, సెకండాఫ్​లో భావోద్వేగభరితంగా బాగా చూపించగలిగాడు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందించిన తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో హిట్ చేస్తారో లేదో చూడాల్సిందే. 

Also Read : మన్మథుడు హీరోయిన్ అన్షూపై సర్జరీ రూమర్స్.. ఘాటైన రిప్లై ఇచ్చిన భామ

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Comedy Thriller OTT : ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్
Rao Bahadur OTT : రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget