News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

పెట్టుబడి రూ.15 కోట్లు, వచ్చింది రూ.303 కోట్లు - స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్‌ను దాటేసిన ఒక్క చిన్న చిత్రం

ఆ సినిమాలో ఏ స్టార్ హీరో లేడు. పైగా దీని బడ్జెట్ కూడా రూ.15 కోట్లే. అయినా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ క్రియేట్ చేసిన వండర్స్ అంతా ఇంతా కాదు.

FOLLOW US: 
Share:

భారీ బడ్జెట్ చిత్రాల ముందు ఎక్కువగా చిన్న బడ్జెట్ చిత్రాలు నిలబడలేవు. ఒక భారీ బడ్జెట్ చిత్రంతో పాటు చిన్న సినిమా కూడా ఒకేరోజు విడుదల అవ్వాలని చూస్తే.. దానికి ఎక్కువగా థియేటర్లు దొరకకపోవడం, ఆ మూవీని ఎక్కువగా ఎవరూ పట్టించుకోకపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ అదే చిన్న సినిమా బాగుంది అంటూ టాక్ మొదలయితే మాత్రం.. మూవీ లవర్స్ అనేవారు కచ్చితంగా ఆ మూవీ ఎలా ఉందో థియేటర్లలో స్వయంగా చూసి తెలుసుకోవాలని అనుకుంటారు. అలా కేవలం మౌత్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ‘ది కేరళ స్టోరీ’. 2023లో విడుదలయిన ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను తన కలెక్షన్స్‌తో బీట్ చేసింది ‘ది కేరళ స్టోరీ’.

‘ది కేరళ స్టోరీ’ వండర్స్..
‘ది కేరళ స్టోరీ’ సినిమాలో ఏ స్టార్ హీరో లేడు. పైగా దీని బడ్జెట్ కూడా రూ.15 కోట్లే. అయినా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ క్రియేట్ చేసిన వండర్స్ అంతా ఇంతా కాదు. కాకపోతే ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తో మాత్రమే హిట్ సాధించలేదు. ట్రైలర్‌తోనే ‘ది కేరళ స్టోరీ’పై ఆసక్తిని క్రియేట్ చేశాడు దర్శకుడు సుదీప్తో సేన్. దీంతో 2023లో అత్యంత లాభాలు పొందిన ఇండియన్ సినిమాల లిస్ట్‌లో భారీ బడ్జెట్ చిత్రాలన్నీ వెనక్కి తోసి ఈ మూవీ టాప్ స్థానాన్ని దక్కించుకుంది. దీని బడ్జెట్ రూ.15 కోట్లు మాత్రమే అయినా.. ప్రపంచవ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ రూ.303 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇక నెట్ కలెక్షన్స్ విషయానికొస్తే రూ.250 కోట్లు వెనకేసుకుంది. అంటే బడ్జెట్‌తో పోలిస్తే దాదాపుగా 1500 శాతం లాభాలను మూటగట్టుకుంది ‘ది కేరళ స్టోరీ’. ఇటీవల కాలంలో ఇంత భారీగా లాభాలు సంపాదించుకున్న ఇండియన్ సినిమాగా ఈ మూవీకి రికార్డ్ దక్కింది.

స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్‌కు మించి..
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ కూడా అత్యంత కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీని గ్రాస్ కలెక్షన్స్ రూ. 1050 కోట్లు కాగా.. నెట్ కలెక్షన్స్ రూ.850 కోట్లని తెలుస్తోంది. అయితే ‘పఠాన్’ను రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు మేకర్స్. దీన్ని బట్టి చూస్తే.. ఆ మూవీకి వచ్చిన లాభం 240 శాతం. ఇది కూడా మంచి లెక్కలనే చూపిస్తున్నా ‘ది కేరళ స్టోరీ’ దరిదాపుల్లోకి కూడా ‘పఠాన్’ లాభాలు రావడం లేదు.

ఇక రజినీకాంత్ ‘జైలర్’ కూడా అంతే. ఇప్పటికీ ‘జైలర్’ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తూనే ఉండగా.. ఈ మూవీకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్.. రూ. 430 కోట్లని సమాచారం. అయితే ఈ చిత్రానికి మేకర్స్ పెట్టిన బడ్జెట్.. రూ.200 కోట్లు. దీన్ని బట్టి చూస్తే ‘జైలర్’కు వచ్చిన లాభాల శాతం 115. ఇక వీటితో పాటు ఒక హిందీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేస్తోంది. అదే ‘గదర్ 2’. సన్నీ డియోల్ నటించిన ఈ మూవీ.. రూ.400 కోట్ల కలెక్షన్స్‌ను సాధించగా.. రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. అంటే 400 శాతం లాభాలను ‘గదర్ 2’ వెనకేసుకుంది. ఇదే విధంగా గతేడాది తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి అత్యంత భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో టాప్ స్థానంలో ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఉండగా.. ఆ తరువాతి స్థానాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘కాంతార’ ఉన్నాయి.

Also Read: ప్రభాస్ వీడియో లీక్ చేసేశారే - మెగాస్టార్ బర్త్‌డేకు చిరు లీక్స్ స్ఫూర్తితో!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Aug 2023 10:49 AM (IST) Tags: Adah Sharma Rajinikanth Shah Rukh Khan Sudipto Sen The Kerala Story sunny deol Pathaan Jailer Gadar 2

ఇవి కూడా చూడండి

చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?

చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?

‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్‌లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్‌లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!

షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!

టాప్ స్టోరీస్

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు

Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు