అన్వేషించండి
Advertisement
నాగచైతన్య కోసం సోషల్ డ్రామా ట్రై చేస్తున్న ‘ఉగ్రం’ డైరెక్టర్
'నాంది' వంటి సక్సెస్ ఫుల్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన విజయ్ కనకమేడల.. ఇప్పుడు 'ఉగ్రం' తో వస్తున్నాడు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య కోసం ఒక సోషల్ డ్రామా రాస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
‘నాంది’ వంటి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన విజయ్ కనకమేడల తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించడమే కాదు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. అయితే తనకు తొలి అవకాశాన్ని అందించిన అల్లరి నరేశ్ హీరోగా ఇప్పుడు ‘ఉగ్రం’ అనే మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ తో వస్తున్నాడు డైరెక్టర్ విజయ్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు విజయ్ సినిమా విశేషాలను పంచుకున్నారు.
- అల్లరి నరేశ్ పూర్తి రౌద్రం..
‘నాంది’ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఆరు నెలలు ఖాళీగా కూర్చున్న సమయంలో 'ఉగ్రం' కథ చేసుకున్నాను. ఇది నరేష్ కి బావుంటుంది అనిపించింది. ఆయన ఎమోషన్స్ చేశారు కానీ, పూర్తి రౌద్ర రసంతో మూవీ చేయలేదు. అందుకే ఆయనకి కొత్తగా ఉంటుదనిపించింది. కథ ఆయనకు నచ్చిన తర్వాత ఆరు నెలలు రీసెర్చ్ చేశాం. ఇందులో 'నాంది' కంటే ఎక్కువ ఎమోషన్స్, మాస్, ఇంటెన్స్ ఉంటుంది. ఉగ్రం మంచి యాక్షన్ థ్రిల్లర్. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్.. సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.
- మిస్సింగ్ సబ్జెక్ట్ పై కథ రాయడానికి కారణమిదే..
నిత్యం మిస్సింగ్ వార్తలు కనిపిస్తూనే వున్నాయి. తెలంగాణ హైకోర్టు కోర్టు కూడా మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్మెంట్ ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. ఈ అంశంపై, తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల్లో బాధ ఎలా వుంటుందనే దానిపై కథ చేస్తే బావుంటుదనిపించింది. సినిమాలో కొంత సోషల్ ఎలిమెంట్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం. అయినప్పటికీ కమర్షియల్ గానే ఉంటుంది.
- కథ ఆయనది.. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నాది..
తూమ్ వెంకట్ నేనూ మంచి స్నేహితులం. అంతకుముందు డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర పని చేశాం. ఇండిపెండెంట్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత తనది కథ, నాది స్క్రీన్ ప్లే - డైరెక్షన్ క్రెడిట్స్ అనుకున్నాం. మా కోఆర్డినేషన్ చాలా బావుంటుంది.
- నరేశ్ మొదటి సారి సీరియస్ పోలీస్ రోల్ లో..
ఉగ్రమ్ కథ చెప్పినప్పుడే అందులోని సీరియస్ నెస్ నరేష్ కి అర్ధమైపోయింది. గెటప్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో క్లారిటీ వచ్చింది. దీనికి సిక్స్ ప్యాక్ బాడీ పెంచాల్సిన అవసరం లేదు. కానీ స్టిఫ్ గా ఉండటానికి కొన్ని వర్క్ అవుట్స్ చేయడం, కాన్ఫిడెంట్ గా మాట్లాడటం ఇవన్నీ షూటింగ్ కి ముందే చర్చించుకున్నాం. ఇక యాక్షన్ సీన్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ప్రతి సీక్వెన్స్ లో ఎమోషన్ ఉంటుంది. హీరో ఫైట్ చేస్తే దానికి ఒక కారణం వుంటుంది. ఆ ఎమోషన్ ని ప్రేక్షకులు కూడా ఫీలౌతారు. కథ ఎక్కువ భాగం రాత్రి వేళల్లో జరగడం వలన నైట్ షూట్ ఎక్కువగా చేయాల్సివచ్చింది.
- నాంది, ఉగ్రం సినిమాలకు సంబంధమే లేదు..
నాంది, ఉగ్రం చిత్రాలకు ఎలాంటి కనెక్షన్ లేదు. ఆ కథ ప్రజంటేషన్ వేరు. ఈ స్టోరీ ప్రజంటేషన్ వేరు. అది కోర్టు రూమ్ డ్రామా.. ఇది యాక్షన్ థ్రిల్లర్, స్పీడ్ గా పరిగెడుతుంది. ఏదైనా స్క్రిప్ట్ ప్రకారమే వుంటుంది. నేను కథలో హీరో సెంట్రిక్ గా వుండే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. నరేష్ గారు ఇప్పటికే ఆల్ రౌండర్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఉగ్రంతో యాక్షన్ లో కూడా యాక్సెప్ట్ చేస్తారని నమ్మకంగా ఉన్నాను.
- యువ సామ్రాట్ కోసం సోషల్ డ్రామా..
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య కోసం ఓ కథ అనుకుంటున్నాం. అది చాలా మంచి సోషల్ డ్రామా అవుతుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
వరంగల్
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement