Thank You OTT Release: 'థాంక్యూ' ఓటీటీ డీల్ ఫిక్స్, నాగ చైతన్య సినిమా ఏ ఓటీటీలో వస్తుందంటే?
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'థాంక్యూ' నేడు థియేటర్లలో విడుదలైంది. మరి, ఈ సినిమా ఏ ఓటీటీలో విడుదల కానుంది? అనే వివరాల్లోకి వెళితే...
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటించిన సినిమా 'థాంక్యూ'. ఈ రోజు థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ... చైతూ నటనకు మంచి పేరు వచ్చింది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ బాగా చేశాడని ప్రేక్షకులు, విమర్శకులు చెబుతున్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో రిపోర్ట్ తెలుసుకోవడం కోసం కొంత మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్టు... సినిమా విడుదలైన తర్వాత ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే విషయం తెలుసుకోవడానికి కూడా కొంత మంది అంతే ఆసక్తి చూపిస్తున్నారు.
'థాంక్యూ' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ సొంతం చేసుకుంది. టీవీల్లో చూడాలని కోరుకునే ప్రేక్షకులు జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యే వరకూ వెయిట్ చేయాలి. అంతకు ముందు డిజిటల్ స్క్రీనింగ్ కోసం అయితే ప్రైమ్ వీడియోలో వచ్చే వరకు వెయిట్ చేయాలి.
ఇటీవల పెద్ద సినిమాలను ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని కొంత మంది నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. అందులో 'దిల్' రాజు కూడా ఒకరు. 'ఎఫ్ 3' సినిమాను నాలుగు వారాలలో కాకుండా లేటుగా ఓటీటీలో విడుదల చేశారు. 'థాంక్యూ' సినిమానూ అదే విధంగా విడుదల చేయనున్నారని టాక్.
Also Read : ‘థాంక్యూ’ రివ్యూ - నాగ చైతన్య వన్ మ్యాన్ షో, ప్రేక్షకులు థాంక్స్ చెబుతారా?
View this post on Instagram
'థాంక్యూ'లో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. మాళవికా నాయర్ హీరో స్కూల్ లైఫ్ లవ్ ఇంట్రెస్ట్ రోల్ చేశారు. అవికా గోర్ రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సుస్పెన్స్. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. 'దిల్' రాజు, శిరీష్ నిర్మించారు.
Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?