అన్వేషించండి

Thandel Release Date: 'తండేల్' రిలీజ్ డేట్ - దేశభక్తి ప్రేమ కథతో నాగ చైతన్య థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

Naga Chaitanya's Thandel Movie Release Date: నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న 'తండేల్' విడుదల విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. థియేటర్లలోకి సినిమా ఎప్పుడు వస్తుందంటే?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా రూపొందుతున్న సినిమా 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సగర్వంగా సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై 'బన్నీ' వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా విడుదలపై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. 

డిసెంబర్ 20న 'తండేల్' విడుదల!
Naga Chaitanya and Sai Pallavi's Thandel worldwide release on December 20th: 'తండేల్' చిత్రాన్ని డిసెంబరు 20న థియేటర్లలోకి తీసుకు రావాలని నాగ చైతన్య, దర్శక నిర్మాతలు చందూ మొండేటి, బన్నీ వాసు భావిస్తున్నారు. అతి త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!

'తండేల్'ను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. అయితే, తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథలో దేశభక్తి అంశాలతో పాటు రస్టిక్ లవ్ స్టొరీ ఉంది. ఈ రెండిటికి తోడు 'కార్తికేయ 2'తో చందూ మొండేటి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. 'లాల్ సింగ్ చద్దా' సినిమా, 'దూత' వెబ్ సిరీస్ ద్వారా చైతూ సైతం ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అందువల్ల, 'తండేల్'ను పాన్ ఇండియా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

'లవ్ స్టోరీ' సినిమాతో చైతూ, సాయి పల్లవి విజయం అందుకున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థలో '100 పర్సెంట్ లవ్' వంటి హిట్ సినిమా చేశారు చైతూ. దర్శకుడితో 'ప్రేమమ్' వంటి హిట్ చేసిన రికార్డ్ ఉంది. దర్శక నిర్మాతలు, హీరోయిన్.. ముగ్గురితో చైతూది హిట్ కాంబినేషన్. ఇప్పుడు మరో హిట్ కోసం రెడీ క్రిస్మస్ వీకెండ్ మీద కన్నేశారు. ప్రస్తుతానికి డిసెంబర్ 20న నితిన్ 'రాబిన్ హుడ్' సినిమా ఒక్కటే విడుదలకు సిద్ధమైంది.

Also Readఅల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!


డీ గ్లామర్ క్యారెక్టర్లలో చైతూ & సాయి పల్లవి!
ఆల్రెడీ విడుదలైన 'తండేల్' ప్రచార చిత్రాలు చూస్తే... హీరో హీరోయిన్లు నాగ చైతన్య, సాయి పల్లవి డీ గ్లామరస్ అవతారంలో, ఆయా పాత్రలకు అనుగుణంగా కనిపించారు. నటీనటుల గెటప్స్, కాస్ట్యూమ్స్ నుంచి బాడీ లాంగ్వేజ్, యాస వరకు ప్రతి విషయంలో దర్శకుడు చందూ మొండేటి పర్ఫెక్ట్‌గా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు.

Also Readవందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే


'తండేల్' చిత్రానికి రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ శామ్‌ దత్ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకుడు: శ్రీ నాగేంద్ర తంగాల, రచన - దర్శకత్వం: చందూ మొండేటి, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: 'బన్నీ' వాసునిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్.

టాప్ హెడ్ లైన్స్

Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget