అన్వేషించండి

Justice For Sangeetha: ట్రెండింగ్‌లో 'జస్టిస్ ఫర్ సంగీత'... విజయ్ - త్రిష వైరల్ వీడియోపై నెటిజన్ల షాకింగ్ రియాక్షన్

తమిళ స్టార్స్ విజయ్ - త్రిష కలిసి ఒకే ప్రైవేట్ జెట్ లో ప్రయాణిస్తూ కన్పించారు. దీంతో సోషల్ మీడియాలో 'జస్టిస్ ఫర్ సంగీత' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కి హాట్ టాపిక్ గా మారింది. 

త్రిష, విజయ్ రిలేషన్షిప్ పై రూమర్స్ 
'వర్షం' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి, స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో ఒకానొక టైమ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ ను ఊపేసింది. సడన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చి, కొంతకాలం తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే రీఎంట్రీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ అదరగొడుతుంది. అయితే కొన్నాళ్ళ నుంచి త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి మధ్య రిలేషన్ నడుస్తోంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలపై వీళ్ళిద్దరూ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. కాగా త్రిష ఇప్పటి వరకు ఐటెం సాంగ్ ల జోలికి వెళ్లలేదు. కానీ విజయ్ హీరోగా నటించిన 'లియో' సినిమాలో మాత్రం ఫస్ట్ టైం అలాంటి సాంగ్ లో నటించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోని తాజాగా మరోసారి త్రిష విజయ్ కలిసి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 

ట్రెండింగ్ లో 'జస్టిస్ ఫర్ సంగీత' 
తాజాగా త్రిష, విజయ్ ఒక ప్రైవేట్ జెట్ లో కలిసి ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం ఆమె ప్రియుడితో జరిగిన సంగతి తెలిసిందే. కీర్తి పెళ్లి కోసమే వీళ్ళిద్దరూ కలిసి వెళ్తూ కెమెరా కంటికి చిక్కినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వీడియోని చూసిన చాలా మంది నెటిజన్లు నిజంగానే వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అంటూ కామెంట్శ చేస్తున్నారు. అందులో భాగంగానే 'జస్టిస్ ఫర్ సంగీత' అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Also Read: 50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్

విజయ్ - సంగీత విడాకుల రూమర్స్ 
విజయ్ 1999లో సంగీతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2023లో విజయ్ - సంగీత మధ్య గొడవలు అవుతున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని రూమర్లు విన్పించాయి. ఇక ప్రస్తుతం విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికంటే ముందు ఆయన ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ - త్రిష మధ్య ఇలాంటి కామెంట్స్ రావడం గమనార్హం. మరి ఈ వార్తలపై త్రిష, విజయ్ స్పందిస్తారా? లేదంటే ఎప్పటిలాగే లైట్ తీసుకుంటారా? అన్నది చూడాలి. 

Also Readమిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget