Goat Hindi Release: దళపతి విజయ్‌కు షాక్ ఇచ్చిన మల్టీప్లెక్స్‌లు - అక్కడ 'గోట్'ను ఎందుకు రిలీజ్ చెయ్యట్లేదంటే?
Thalapathy Vijay: దళపతి విజయ్ హీరోగా నటించిన 'ది గోట్' మరికొన్ని గంటల్లో థియేటర్లలో రానుంది. అయితే, విడుదలకు ముందు విజయ్ సినిమాకు మల్టీప్లెక్స్‌లు షాక్ ఇచ్చాయి. అది ఏమిటంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay)కు నేషనల్ మల్టీప్లెక్స్ థియటర్లు భారీ షాక్ ఇచ్చాయి. 'ది గోట్' (The Goat Movie) సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు చావు కబరు చల్లగా చెప్పాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేసేది లేదని స్పష్టం చేశాయి. అసలు వివరాల్లోకి వెళితే...
'ది గోట్' హిందీ వెర్షన్ విడుదలకు పెద్ద దెబ్బ!
పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్... నార్త్ ఇండియాలోని ఈ నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ (థియేటర్)లలో 'ది గోట్' హిందీ వెర్షన్ విడుదల కావడం లేదు. అయితే... సౌత్ స్టేట్స్ - తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ స్క్రీన్లలో తమిళ, తెలుగు వెర్షన్స్ విడుదల అవుతాయి.
హిందీలో ఎందుకు విడుదల చేయడం లేదు?
దక్షిణాది రాష్ట్రాల్లోని పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ స్క్రీన్లలో 'ది గోట్'ను విడుదల చేస్తూ... నార్త్ ఇండియా రాష్ట్రాల్లో ఎందుకు విడుదల చేయడం లేదు? - ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అందుకు సమాధానం ఒక్కటే... ఓటీటీ డీల్!
థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ (డిజిటల్ స్ట్రీమింగ్) మధ్య కనీసం ఎనిమిది వారాల వ్యవధి తప్పనిసరిగా ఉండాలని నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఆ విధంగా లేని పక్షంలో సినిమాలను విడుదల చేయడం లేదు. 'ది గోట్' విషయంలోనూ అదే జరిగింది. ఎనిమిది వారాల కంటే ముందు ఓటీటీలోకి సినిమా వస్తుందని తెలిసి పక్కన పెట్టేశాయి. అదీ సంగతి!
THALAPATHY VIJAY - 'G.O.A.T.': NO *HINDI* RELEASE AT NATIONAL CHAINS... The *#Hindi version* of #GOAT - starring #ThalapathyVijay - is not releasing in national chains [#PVR, #INOX and #Cinepolis] in #NorthIndia.
— taran adarsh (@taran_adarsh) September 4, 2024
Reason: The national chains have - for quite some time - adhered… pic.twitter.com/z3IljgYDLU
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'ది గోట్' సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ చేశారు. తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. తండ్రి పాత్ర సరసన సీనియర్ కథానాయిక స్నేహ నటించారు. 'జీన్స్' హీరో ప్రశాంత్, సీనియర్ హీరోయిన్ లైలా, వైభవ్, ప్రేమ్ జి అమరన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. 'ది గోట్' విజయ్ లాస్ట్ సినిమా ప్రచారం జరగడంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనిపై ప్రేక్షకులలో అంచనాలు సైతం బావున్నాయి. రాజకీయాల్లోకి వెళుతుండటంతో ఆయన సినిమాలు చేసే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. అయితే... 'ది గోట్' తర్వాత విజయ్ మరో సినిమా చేస్తారని టాక్.
Also Read: మిస్టర్ బచ్చన్ తేడా ఎఫెక్ట్... రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన హరీష్ శంకర్