అన్వేషించండి

Neeraja Kona: నాని సపోర్ట్‌... నితిన్ సలహా... సిద్ధూతో సినిమా... ‘తెలుసు కదా’ దర్శకురాలు నీరజ కోన ఇంటర్వ్యూ

Neeraja Kona: కాస్ట్యూమ్ డిజైన్ నుంచి డైరెక్షన్ వైపు రావడానికి ఎందరో సపోర్ట్ చేశారు. నాకు స్కూల్ డేస్ నుంచి రైటింగ్ అంటే చాలా ఇష్టం. పోయెట్రీలో ఒక పుస్తకం కూడా పబ్లిష్ అయింది. కథలు చెప్పమంటే..

Neeraja Kona About Telusu Kada: కోన నీరజ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. స్టైలిష్ట్‌గా ఆమె చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు వర్క్ చేశారు. ఇప్పుడామె దర్శకురాలిగా తన ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా కోన నీరజ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘తెలుసు కదా’. ‘మిరాయ్’ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను దర్శకురాలు నీరజ కోన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

‘‘కాస్ట్యూమ్ డిజైన్ నుంచి డైరెక్షన్ వైపు రావడానికి ఎందరో సపోర్ట్ చేశారు. నాకు స్కూల్ డేస్ నుంచి రైటింగ్ అంటే చాలా ఇష్టం. పోయెట్రీలో ఒక పుస్తకం కూడా పబ్లిష్ అయింది. కథలు చెప్పమంటే చాలా బాగా చెప్తాను. ఈ జర్నీలో నాని వంటి స్నేహితులు చాలా సపోర్ట్ చేశారు. ఒక దశలో సినిమాకి కథ రాయగలననే నమ్మకం కుదిరింది. అలా రాసుకున్న కథల్లో ఒకటే.. ‘తెలుసు కదా’. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎవరి దగ్గరా పని చేయలేదు. దాదాపు వంద సినిమాలకు పైగా కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇదే నా ఎక్స్‌పీరియెన్స్, లెర్నింగ్ స్కూల్. ‘పులి మేక’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నితిన్‌ని కలిశాను. తనకు ఈ ఐడియా చెప్పాను. ఈ కథకు సిద్దు అయితే బాగుంటాడని ఆయనే చెప్పారు. ఆ తర్వాత సిద్దుని కలిసి కథ వినిపించాను. సింగిల్ సిట్టింగ్లో కథ వినడం, వెంటనే ఆయన మేనేజర్ ఫోన్ చేసి ఈ కథ చేస్తున్నామని చెప్పడం.. ఇవి నా జీవితంలో మర్చిపోలేని మూమెంట్స్. రైటర్‌గా, డైరెక్టర్‌గా ఈ ప్రాజెక్ట్‌తో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

Also Read: పవన్ సినిమాలో విలన్ రోల్... రిజక్ట్ చేసిన పాపులర్ పొలిటీషియన్!

‘తెలుసు కదా’ ఒక లవ్ స్టోరీ. ఇద్దరి మధ్య ఉండే ప్రేమ కథ. ఒక ప్రేమ కథతో పాటు ఒక కాంప్లెక్స్ సిటీ కూడా ఇందులో వుంది. ఇది పాత్రల ప్రభావంతో నడిచే చిత్రం. ఇందులో మూడు పాత్రలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ప్రతి పాత్ర కూడా చాలా హానెస్ట్‌గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూనే ఎంటర్‌టైన్ చేస్తుంది. టీజర్‌లో అసలు కథని రివీల్ చేయలేదు. ట్రైలర్‌తో మాత్రం ఇది పాత్రల ప్రభావంతో నడిచే కథ అని చెప్పబోతున్నాం. సిద్దుకి యూనిక్ పర్స్పెక్టివ్ ఉండటంతో నా రైటింగ్ ఇంకా బెటరైంది. తను ఈ కథకి మరో పర్స్పెక్టివ్‌ను తీసుకొచ్చారు. సిద్దుకి డిజె టిల్లు ఐకానిక్ క్యారెక్టర్. ఒక నటుడికి అలాంటి ఐకానిక్ పాత్ర దొరకడం అనేది చాలా అదృష్టం. ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా కొందరికి ఐకానిక్ రోల్ దొరకదు. కానీ సిద్దూకి టిల్లు లాంటి అద్భుతమైన క్యారెక్టర్ కెరీర్ బిగినింగ్‌లోనే పడటం నిజంగా అతని అదృష్టమే. అలాంటి ఇమేజ్ ఉన్న హీరో.. ఒక కొత్త క్యారెక్టర్ చేయడం చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. కానీ ఇందులో వరుణ్ క్యారెక్టర్‌ను ఆయన చాలా యూనిక్‌గా ప్రజెంట్ చేశారు. ఒక ఫిలిం మేకర్‌గా నాకు ఏం కావాలో.. అది వరుణ్‌గా సిద్ధులో చూశాను. అతని ఈ పాత్ర చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. శ్రీనిధి చేసిన రాగ ఇందులో కాంప్లెక్స్ క్యారెక్టర్. ‘హిట్ 3’ కంటే ముందే ఈ క్యారెక్టర్ చెప్పాను. అంజలి పాత్రలో రాశి చాలా అద్భుతంగా నటించింది. తనది చాలా యూనిక్ రోల్.

తమన్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ సినిమాకు తన మ్యూజిక్ బ్యాక్ బోన్. పాటలన్నీ మంచి హిట్ అయ్యాయి. ఆయన ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వ ప్రసాద్ లేకపోతే ఈ సినిమానే లేదు. కృతి ప్రసాద్ ఈ సినిమాతో చాలా క్లోజ్ అయ్యారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా, ఏది కావాలంటే అది ఇచ్చారు. వారి సపోర్ట్‌ని మరిచిపోలేను. నేనొక మహిళను కాబట్టి.. ఇందులో అమ్మాయిలవైపు బయాస్ తీసుకున్నారా? అని అంతా అడుగుతున్నారు. అందుకు నేను ఇచ్చే సమాధానం ఒక్కటే.. ఒక కథ అమ్మాయి రాసిందా? అబ్బాయి రాసిందా? అనేదానికంటే బాగా రాశారు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. నా దృష్టి కూడా కథని హానెస్ట్‌గా చెప్పడం పైనే ఉంది. ఈ కథ ఎలాంటి బయోస్ తీసుకోకుండా రాశాను. ఈ సినిమాని అబ్బాయి తీసారా. అమ్మాయి తీసారా? అనే దానికంటే.. ఒక గుడ్ ఫిలిం మేకర్ తీసిన సినిమా అని పేరు తెచ్చుకోవడం పైనే దృష్టి పెట్టాను.

ఒక అసిస్టెంట్‌గా కెరియర్ స్టార్ట్ చేశాను. కాస్ట్యూమ్ డిజైనర్‌గా నా మొదటి చిత్రం ‘బాద్‌షా’. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది, ఎవడు, రామయ్య వస్తావయ్య’ ఇలా ఎన్నో పెద్ద సినిమాలకి  వర్క్ చేశాను. కోలీవుడ్‌లో విజయ్, కార్తీక్, సూర్య, విక్రమ్, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం దొరికింది. నాకు మొదటి నుంచి నేర్చుకోవడం ఇష్టం. ఈ జర్నీలో ఎంతో మంది గొప్ప టెక్నిషియన్స్‌తో కలిసి వర్క్ చేశాను. ఆ అనుభవం.. నాకు నేర్చుకోవడానికి, ఫిల్మ్ మేకర్ కావడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సినిమా తర్వాత ఒక హార్డ్ హిట్టింగ్ లవ్ స్టొరీ చేయబోతున్నాను. త్వరలోనే అఫీషియల్ ప్రకటన ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

Also Read: ఫ్లాపుల్లో ఉన్నా పూజా హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గలేదు... దుల్కర్ సల్మాన్ సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget