అన్వేషించండి

Telugu Movies This Week: థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు - తమిళ్, హిందీలో ఏమున్నాయ్ అంటే?

This Week Theatre Release:శ్రీవిష్ణు 'ఓం భీమ్ బుష్'తో పాటు థియేటర్లలో ఈ వారం మరో నాలుగైదు సినిమాలు విడుదల అవుతున్నాయి. తమిళంలో విక్రమ్, జీవీ ప్రకాష్ కుమార్ సినిమాలూ ఉన్నాయి. అవి ఏమిటో చూడండి.

థియేటర్లలో ప్రేక్షకులకు ఈ  వారం ట్రిపుల్ ధమాకా రెడీ! కొత్త సినిమాలతో పాటు రీ రిలీజులు, బాలీవుడ్ & హాలీవుడ్ సినిమాలు సైతం వస్తున్నాయి. ఆ సినిమాలు ఏవో చూడండి.

ఆర్ఆర్ఆర్ ఈజ్ బ్యాక్...
ఆ ముగ్గురూ వస్తున్నారు బ్రో!
రాహుల్, రాకీ, రాంబో... 'బ్రోచేవారెవరురా' సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పేర్లు! ఆర్ఆర్ఆర్... ఆ ముగ్గురూ మళ్లీ థియేటర్లలోకి 'ఓం భీమ్ బుష్'తో వస్తున్నారు. నో లాజిక్, ఓన్లీ మేజిక్ సినిమా కాప్షన్. ట్రైలర్ నవ్వించింది. సాంగ్స్ సైతం బావున్నాయి. వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల దృష్టి తమ సినిమాపై పడేలా చేస్తున్నారు. ఈ సినిమాకు 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. మార్చి 22న థియేటర్లలో విడుదల అవుతోందీ సినిమా.

థియేటర్లలోకి మళ్లీ మళ్లీ...
ఉదయ్ కిరణ్ 'నువ్వు నేను'!
ఉదయ్ కిరణ్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా 'నువ్వు నేను'. ఆర్పీ పట్నాయక్ అందించిన బాణీలు ఇప్పటికీ వినబడుతుంటాయి. అప్పట్లో బ్లాక్ బస్టర్ సాధించిందీ సినిమా. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మార్చి 21న రీ రిలీజ్ చేస్తున్నారు.

'హద్దు లేదురా' సినిమాతో...
'నాటకం' హీరో ఆశిష్ గాంధీ!
'ఓం భీమ్ బుష్' కంటే ఒక్క రోజు ముందు థియేటర్లలోకి 'హద్దు లేదురా' సినిమా  (Haddu Ledura Movie) వస్తోంది. అందులో 'నాటకం', 'రుద్రంగి' ఫేమ్ ఆశిష్ గాంధీ హీరో. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సోదరుని కుమారుడు, 'దర్శకుడు' ఫేమ్ అశోక్ మరో హీరో. తనికెళ్ల భరణి కీలక పాత్ర చేశారు. టీజర్, సాంగ్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. మార్చి 21న వస్తున్న ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.

కన్నడ నుంచి పోలీస్ 'యమధీర'...
తెలుగులో మరో మూడు చిన్న సినిమాలు!
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటించిన 'కలియుగం పట్టణంలో' సైతం ఈ నెల 21న విడుదల అవుతోంది. దాంతో పాటు వందే భారత్' అని మరో చిన్న సినిమా ఆ రోజు థియేటర్లలోకి వస్తోంది. మరో చిన్న సినిమా కూడా మార్చి 22న విడుదలకు రెడీ అయ్యింది.

Also Readతంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?

తొలుత మార్చి 15న విడుదలకు సిద్ధమైన త్రిగుణ్ (అరుణ్ ఆదిత్) బైలింగ్వల్ సినిమా 'లైన్ మ్యాన్' కూడా మార్చి 22న థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు కన్నడలో తెరకెక్కించిన చిత్రమిది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ సినిమా 'కెంపె గౌడ 2' సైతం ఈ వారం థియేటర్లలోకి వస్తోంది. మార్చి 23న 'యమధీర'గా ఆ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. కోమల్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్ విలన్.

హిందీలో మార్చి 24న 'రజాకార్'...
తమిళంలో మార్చి 22న జీవీ 'రెబల్'
మార్చి 15న తెలుగులో విడుదలైన 'రజాకార్' సినిమాను హిందీలో 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అంత కంటే ముందు మార్చి 22న ఫ్రీడమ్ ఫైటర్ వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'వీర్ సావర్కర్' సినిమా విడుదల కానుంది. ఆ రోజే 'వాట్ ఏ కిస్మత్', 'మడ్గావ్ ఎక్స్‌ప్రెస్' థియేటర్లలోకి వస్తున్నాయి. 

తమిళంలో మార్చి 22న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'రెబల్' రిలీజ్ కానుంది. ఇందులో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్. మార్చి 23న 'ది బాయ్స్', మార్చి 24న విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించిన 'ధృవ నక్షత్రం' విడుదలకు రెడీ అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో 'ధృవ నక్షత్రం' థియేటర్లలోకి వచ్చే వరకు ప్రేక్షకులు నమ్మే అవకాశాలు తక్కువ.

Also Read: రజాకార్ రివ్యూ: మారణహోమం సృష్టించిన మతోన్మాదం - తెలంగాణ చరిత్రను ఎలా తీశారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Bajaj Chetak Electric: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Bajaj Chetak Electric: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Mohammed Siraj - Travis Head: ట్రావిస్ హెడ్- సిరాజ్ వివాదం, మరో
ట్రావిస్ హెడ్- సిరాజ్ వివాదం, మరో "మంకీ గేట్" అవుతుందా..?
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - భారీగా తరలివస్తున్న అన్నదాతలు
Tecno Phantom V Fold 2 5G: రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
Embed widget