అన్వేషించండి

Tecno Phantom V Fold 2 5G: రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!

Affordable Foldable Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో మనదేశంలో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ. దీని ధర మనదేశంలో రూ.74,999 నుంచి ప్రారంభం కానుంది.

Tecno Phantom V Fold 2 5G Launched: టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. బుక్ తరహాలో ఉండే ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో మెయిన్ స్క్రీన్ 7.85 అంగుళాలు కాగా, 6.42 అంగుళాల కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఫోన్ వెనకవైపు ఏకంగా మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండటం విశేషం. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఫాంటం వీ పెన్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ధర (Tecno Phantom V Fold 2 5G Price in India)
టెక్నో లాంచ్ చేసిన ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ధర రూ.79,999 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇది కేవలం ప్రారంభ ధర మాత్రమే. బ్యాంకు ఆఫర్లు, క్రెడిట్ కార్డు ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. కానీ ఎంత కాలం పాటు ఈ ధర అందుబాటులో ఉండనుందో తెలియరాలేదు. త్వరలో కంపెనీ ధరను మళ్లీ పెంచే అవకాశం ఉంది. డిసెంబర్ 13వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కార్స్ట్ గ్రీన్, రిప్పింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!

టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno Phantom V Fold 2 5G Specificaions)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 7.85 అంగుళాల 2కే ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ప్రధాన డిస్‌ప్లేగా అందించనున్నారు. బయట వైపు 6.42 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందించారు. దీనికి సంబంధించిన గ్లోబల్ వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌తో రన్ కానుంది. కానీ ఇండియన్ వెర్షన్‌లో ఏ ప్రాసెసర్ అందించారో తెలియరాలేదు. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సల్ పొర్‌ట్రెయిట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ అందించారు. ప్రధాన కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియా కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ లెన్స్ అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5750 ఎంఏహెచ్ కాగా, 70W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉన్న స్పీకర్లు ఇందులో ఉండనున్నాయి. టెక్నో ఫాంటం వీ పెన్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఏఐ బ్యాక్డ్ ఇమేజింగ్, ఫొటో ఎడిటింగ్ టూల్స్, గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ మడిచినప్పుడు దీని మందం 1.19 సెంటీమీటర్లు కాగా, ఓపెన్ చేసినప్పుడు దీని మందం 0.55 సెంటీమీటర్లుగా ఉండనుంది.

Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!

టాప్ హెడ్ లైన్స్

NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget