Teja Sajja: 'మిరాయ్' సక్సెస్ జోష్ - అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై తేజ సజ్జా రియాక్షన్... మూడు భారీ ప్రాజెక్టులు
Teja Sajja Projects: యంగ్ హీరో తేజ సజ్జా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను చేయబోయే మూవీస్ గురించి చెప్పారు. 3 భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, సీక్వెల్ అనౌన్స్ చేశారు.

Teja Sajja About His Upcoming Pan India Projects: యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం 'మిరాయ్' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం రోజుల్లోనే దాదాపు రూ.112 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. 'హనుమాన్', 'మిరాయ్' వంటి బిగ్గెస్ట్ హిట్స్‌తో తేజ సజ్జా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడంతో ఆయన చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టులపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిజం చెప్పాలంటే సీక్వెల్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
మెస్మరైజ్ ఐడియాస్ ఫర్ మిరాయ్ 2
తాను చేసిన జాంబిరెడ్డి, హనుమాన్ సీక్వెల్స్‌తో పాటు మిరాయ్ సీక్వెల్ కూడా కచ్చితంగా ఉంటుందని తేజ సజ్జా చెప్పారు. 'ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిరాయ్ హవా నడుస్తోంది. ఇప్పటికే సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ కార్తీకి కన్ఫర్మ్ చేశారు. ఆయన చాలా ఐడియాస్ రెడీ చేసుకుంటున్నారు. సీక్వెల్‌లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఐడియాలు చాలానే ఉన్నాయి. మిరాయ్ సీక్వెల్ 'మిరాయ్: జైత్రయ' అనే పేరుతో రానుంది. మేం రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుంది. ఈ సీక్వెల్ ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది.' అని చెప్పారు. సీక్వెల్‌లో రానా విలన్ రోల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో రానాను చూపిస్తూ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.
జై హనుమాన్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ 'హనుమాన్' గతేడాది సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ 'జై హనుమాన్'ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. హనుమంతుడిగా కన్నడ స్టార్ రిషబ్ శెట్టి చేయనున్నారు. ఈ మూవీ సీక్వెల్‌పై స్పందించిన తేజ... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. 'డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, రిషభ్ శెట్టి వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. అవి పూర్తైతే ఈ మూవీ పనులు ప్రారంభం అవుతాయి.' అని చెప్పారు.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 'మహావతార్ నరసింహ' - రూ.300 కోట్ల డివోషనల్ విజువల్ వండర్ ఇప్పుడే చూసేయండి
జాంబీ రెడ్డి 2
ఇక 2021లో చిన్న సినిమాగా రిలీజై బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది జాంబీ రెడ్డి మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరోనా తర్వాత పరిణామాలు, ఊరిలో జాంబీ వైరస్ వ్యాప్తి వంటి అంశాలను ప్రధానంగా చూపించారు. సీక్వెల్‌పై ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా... ఇటీవలే కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీనిపై రియాక్ట్ అయిన తేజ సజ్జా... 'ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లుగానే జాంబీ రెడ్డి 2 ఉంటుంది. కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ విజువల్స్ మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.' అంటూ అప్డేట్ ఇచ్చారు. 2027లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















