Mahavatar Narasimha OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'మహావతార్ నరసింహ' - రూ.300 కోట్ల డివోషనల్ విజువల్ వండర్ ఇప్పుడే చూసేయండి
Mahavatar Narasimha OTT Platform: రీసెంట్ డివోషనల్ యానిమేటెడ్ బ్లాక్ బస్టర్ 'మహావతార్ నరసింహ' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ శుక్రవారం మధ్యాహ్నం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Mahavatar Narasimha OTT Streaming On Netflix: రీసెంట్‌గా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన డివోషనల్ యానిమేటెడ్ విజువల్ వండర్ 'మహావతార్ నరసింహ'. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ కొన్ని థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతుండగా... తాజాగా మేకర్స్ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'మహావతార్ నరసింహ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
View this post on Instagram
Also Read: విజయ్ ఆంటోని 'భద్రకాళి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఫస్ట్ ఇండియన్ యానిమేటెడ్ మూవీగా...
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా 'మహావతార్ నరసింహ'ను రూపొందించారు. డైరెక్టర్ అశ్వినికుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. యానిమేషన్‌లో హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడి స్టోరీ, శ్రీమహావిష్ణువు నరసింహావతారాన్ని విజువల్‌గా అద్భుతంగా రూపొందించారు. 8 రోజుల్లోనే రూ.60.5 కోట్లు వసూళ్లు సాధించి తక్కువ టైంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా రికార్డు సృష్టించింది.
పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. రీసెంట్‌గా 200 థియేటర్స్‌కు పైగానే 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఆడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. 50 రోజుల్లో కేవలం టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో' ద్వారానే 67 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికీ ఆ జోష్ కొనసాగుతున్నట్లు చెప్పారు.
స్టోరీ ఏంటంటే?
ఇది అందరికీ తెలిసిన పురాణ కథే. శ్రీమహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా ఈ యానిమేటెడ్ మూవీని రూపొందించారు. బ్రహ్మ వరంతో భూలోకంలో ధర్మాన్న కాలరాస్తాడు రాక్షసరాజు హిరణ్యకశిపుడు. బ్రహ్మ సృష్టించిన ఓ జీవి వల్ల కానీ, రాత్రి పగలు కానీ, ఇంటి బయట కానీ లోపల కానీ, ఏ కాలంలోనూ ఎలాంటి అస్త్ర శస్త్రాల నుంచీ కూడా తనకు మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు. వర గర్వంతో మహర్షులను హింసిస్తూ యజ్ఞాలు ధ్వంసం చేస్తూ ధర్మాన్ని నాశనం చేస్తుంటాడు. తన సోదరుడు హిరణ్యాక్షున్ని సంహరించిన విష్ణువుపై పగ సాధించాలని చూస్తాడు.
అయితే, హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడికి శ్రీమహావిష్ణువు అంటే అమితమైన భక్తి. నిరంతరం హరి నామ స్మరణలో విష్ణువుకు అపర భక్తుడిగా మారతాడు. దీంతో కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు బాలున్ని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ, శ్రీమహా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదున్ని నిరంతరం కాపాడుతుంటారు. అసలు హిరణ్యకశిపుడు హరి ద్వేషిగా ఎందుకు మారాడు? దీని వెనుక స్టోరీ ఏంటి? బ్రహ్మ వరం తప్పకుండా హిరణ్యకశిపుని విష్ణువు ఎలా సంహరించాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















