అన్వేషించండి

'సైంధవ్'లో పాత్రలు ఇవే - ఆకట్టుకుంటున్న స్పెషల్ వీడియో!

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెంకటేష్ నటించిన 'సైంధవ్' సినిమా నుంచి స్పెషల్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో సినిమాలో ప్రధానమైన ఎనిమిది పాత్రలను పరిచయం చేశారు.

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. టాలీవుడ్ లో 'హిట్', 'హిట్ 2' వంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ కెరియర్ లో 75వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కావడంతో మూవీ టీం స్పెషల్ వీడియోని విడుదల చేసింది. సినిమాలో ఎనిమిది ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ వీడియోని రిలీజ్ చేశారు.

ఇక 8 ఇంపార్టెంట్ రోల్స్ లో వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిక్, శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా మరియు జయప్రకాష్ నటిస్తున్నట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. సినిమా కథ మొత్తం ఈ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇక ఈ వీడియోలో వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిక్, ఆండ్రియా.. ముగ్గురు గన్ పట్టుకొని కనిపించగా, బ్యాగ్రౌండ్ లో వచ్చే బీజీయం కూడా ఈ పాత్రలను ఎలివేట్ చేసేలా ఉంది. ఇక ఈ వీడియోని విడుదల చేస్తూ ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేసింది చిత్ర యూనిట్. కాగా ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.

ఇందులో కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య సుమారు 16 రోజులపాటు జరిగిన ఈ షెడ్యూల్లో 8 మంది కీలక నటీ నటులతో హై వోల్టేజ్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ ను చిత్రీకరించినట్లు మూవీ టీం తెలియజేసింది. ఇక ఈ క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ని ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ డిజైన్ చేశారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఎస్. మణికందన్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కోల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. కిషోర్ తల్లూరు ఈ సినిమాకి సహనిర్మాత. వెంకటేష్ కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న 'సైంధవ్' ఈ ఏడాది డిసెంబర్ 22 క్రిస్మస్ కానుకగా తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

మరోవైపు వెంకటేష్ సోలో హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అంతేకాదు వెంకీ మామ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావడంతో సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది. దాంతోపాటు థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో శైలేష్ కొలను దిట్ట. గతంలో హిట్ సిరీస్ తో మంచి హిట్స్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ కచ్చితంగా 'సైంధవ్' తో వెంకటేష్ కి భారీ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.

Also Read : పవన్‌పై చంద్రబాబు సెటైర్లు - ‘వ్యూహం’ టీజర్ 2లో ఎవర్నీ వదలని ఆర్జీవీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
Allu Arjun : బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
Embed widget