అన్వేషించండి

Vyooham Teaser 2 Release: పవన్‌పై చంద్రబాబు సెటైర్లు - ‘వ్యూహం’ టీజర్ 2లో ఎవర్నీ వదలని ఆర్జీవీ!

ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘వ్యూహం’ సినిమా నుంచి ఇప్పటికే ఓ టీజర్ విడుదల కాగా, తాజాగా మరో టీజర్ విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు పవన్ మీద వేసే దారున సటైర్లు సంచనలం కలిగిస్తున్నాయి.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు  తీసుకురాబోతున్నారు. ఇందులో తొలి భాగానికి ‘వ్యూహం’ అని పేరు ఖరారు చేయగా, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే ‘వ్యూహం’ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ఏపీ రాజకీయాల్లో దుమారం రేపగా, ఇప్పుడు మరో టీజర్ ను ఆర్జీవీ రిలీజ్ చేశారు.  

దుమ్మురేపిన ‘వ్యూహం’ లేటెస్ట్ టీజర్

ఆర్జీవీ సోషల్ మీడియా ద్వారా ముందుగా చెప్పినట్లుగానే ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఇవాళ(ఆగష్టు 15) ఉదయం 11 గంటలకు ‘వ్యూహం’ మూవీకి సంబంధించిన రెండో టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో నాటి ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జరిగిన సంఘటనలు చూపించే ప్రయత్నం చేశారు ఆర్జీవీ. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి,  సోనియా గాంధీ, రోశయ్య, మన్మోహన్ సింగ్ సహా పలువురి పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘నిజం తన షూ లేస్ కట్టుకునే లోపే, అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంది” అంటూ జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్ హైలెట్ అయ్యింది. ఇక టీజర్ చివరలో చంద్రబాబు పవన్ మీద వేసే సటైర్ అందరినీ షాక్ కి గురి చేసింది.  “ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్ ను కూడా వెన్ను పోటు పొడుస్తారు కదా?” అని చంద్రబాబుని అడగ్గా, “వాడికి అంత సీన్ లేదు.. వాడిని వాడే వెన్ను పోటు పొడుచుకుంటాడు” అని చెప్పే డైలాగ్ సంచలనం కలిగిస్తోంది. 

ఏపీ రాజకీయాలను షేక్ చేసిన ‘వ్యూహం’ తొలి టీజర్

అటు వ్యూహం నుంచి రిలీజైన తొలి టీజర్ లో జగన్ అరెస్టు, కొత్త పార్టీ ఏర్పాటు సహా పలు అంశాలను చూపించారు ఆర్జీవీ. రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైనఈ టీజర్ లో,  వైఎస్సార్ మరణం తర్వాత ఏం జరిగింది? ఎవరి రియాక్షన్ ఏంటి? జగన్ ను కొనడానికి పార్టీ పెద్దలు రావడం, అందుకు తను ఒప్పుకోకపోవడంతో అరెస్టు చేయడం, ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టడం లాంటివి చూపించారు. ఇక “నేనలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా?” అనే డైలాగ్ ఫస్ట్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది.  

ఇక వ్యూహం మూవీని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై  రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్‌, భారతిగా మానస నటిస్తున్నారు. చంద్రబాబు, పవన్, చిరంజీవి పాత్రలు అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  అటు ఎన్నికలకు ముందే ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వస్తే కచ్చితంగా చంద్రబాబు టీమ్ కు షాక్ తప్పదనే టాక్ నడుస్తోంది.

Read Also: బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌‌గా అనసూయ - ఇంతకీ ఎవరు ఆమె? గొప్పతనం ఏంటి?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Horror Comedy OTT : డ్యాన్స్ చేసే దెయ్యాలు - ఓటీటీలో భయపెట్టే మ్యూజికల్ హారర్ కామెడీ... తెలుగులోనూ చూడొచ్చు
డ్యాన్స్ చేసే దెయ్యాలు - ఓటీటీలో భయపెట్టే మ్యూజికల్ హారర్ కామెడీ... తెలుగులోనూ చూడొచ్చు
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Comedy Thriller OTT : ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Embed widget