Taraka Ratna Love Story : తారకరత్న సీక్రెట్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు? ఫ్యామిలీతో గొడవలు ఏంటి? ఎవరీ అలేఖ్యా రెడ్డి?
Know About Taraka Ratna Wife Alekhya Reddy : అలేఖ్యా రెడ్డిని వివాహం చేసుకున్న కారణంగా నందమూరి ఫ్యామిలీకి తారకరత్న దూరంగా ఉండాల్సి వచ్చింది. అసలు, ఆమె ఎవరు? ఫ్యామిలీతో మనస్పర్థలు ఎందుకు వచ్చాయి?
తారక రత్న (Taraka Ratna) నందమూరి కుటుంబ సభ్యుడిగా, ఎన్టీ రామారావు మనవడిగా మెజారిటీ తెలుగు ప్రజలకు తెలుసు. అయితే, ప్రస్తుతం ఏపీలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలలో ఒకరైన విజయ సాయి రెడ్డికి బంధువు కూడా! భార్య అలేఖ్యా రెడ్డి (Taraka Ratna Wife Alekhya Reddy) నుంచి అటు బంధుత్వం ఉంది.
సీక్రెట్ & సింపుల్ మ్యారేజ్ ఎందుకు?
నందమూరి తారక రత్న, అలేఖ్యా రెడ్డి వివాహం 2012లో ఆగస్టు 2న హైదరాబాద్ నగర శివార్లలో గల సంఘీ టెంపుల్‌లో చాలా నిరాడంబరంగా జరిగింది. సింపుల్ & సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో అలా చేశారు. తమ మాటను కాదని ప్రేమ వివాహం చేసుకోవడంతో కొన్నాళ్ళ పాటు తారక రత్నను నందమూరి కుటుంబం దూరం పెట్టిందని, సత్సంబంధాలు లేవనేది పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే.
ఎవరీ అలేఖ్యా రెడ్డి?
విజయ సాయి రెడ్డి భార్య, అలేఖ్యా రెడ్డి తల్లి స్వయానా అక్కా చెల్లెళ్ళు. అలేఖ్యా రెడ్డి తండ్రి కొన్నాళ్ళు అనంతపురంలో రవాణా శాఖలో ఉదోగ్యం చేశారు. తన మరదలి కుమార్తెను తారక రత్న వివాహం చేసుకున్నారని... ఆయన తమ ఇంటి అల్లుడని... చంద్రబాబు తనకు సోదరుడి వరుస అని ఓసారి విజయ సాయి రెడ్డి తెలిపారు. తారక రత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆయన సహాయ సహకారాలు అందించినట్టు తెలిసింది. బెంగళూరులోని నారాయణ హృదయాలయాకు విజయ సాయి రెడ్డి వెళ్ళి అల్లుడి ఆరోగ్య పరిస్థతి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాలకృష్ణకు థ్యాంక్స్ కూడా చెప్పారు.
తారక రత్న కుటుంబ సభ్యులు, తమ కుటుంబ సభ్యులు పెళ్ళికి సమ్మతం తెలపలేదని.... అప్పుడు తన అంకుల్ విజయ సాయి రెడ్డి సపోర్ట్ చేశారని అలేఖ్యా రెడ్డి గతంలో తెలిపారు. పెళ్ళికి ఆమె సిస్టర్స్ & బ్రదర్స్, కజిన్స్ మినహా ఎవరూ అటెండ్ కాలేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళలేదు.
నందమూరి తారక రత్న... అలేఖ్య...
పరిచయమెలా? ఎవరు ప్రపోజ్ చేశారు?
అలేఖ్యా రెడ్డి సోదరి చెన్నైలోని ఓ పాఠశాలలో చదువుకున్నారు. ఆమెకు తారక రత్న సీనియర్. అయితే, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కలుసుకున్నారు. 'నందీశ్వరుడు' సినిమాకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. తొలుత తారక రత్న లవ్ ప్రపోజ్ చేశారు.
అలేఖ్యాకు రెండో పెళ్ళి కావడంతో...
తారక రత్న, అలేఖ్యా రెడ్డి వివాహానికి నందమూరి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణం విడాకులే. తారక రత్నకు ఇది తొలి వివాహం కాగా... ఆమెకు రెండోది. మాజీ హోమ్ మంత్రి ఎలిమినేటి మాధవ్ రెడ్డికి అలేఖ్య మాజీ కోడలు. సందీప్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ కారణంగా కొన్నాళ్ళు కుటుంబాల మధ్య మాటలు లేవు. తన సొంత చెల్లెలు రూప వివాహానికి కూడా తారక రత్నకు ఆహ్వానం అందలేదు. ఆయన హాజరు కాలేదు.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
అమ్మాయి అంటే తారక రత్నకు ప్రాణం!
తారక రత్న, అలేఖ్య దంపతులకు ఓ అమ్మాయి. పెళ్ళైన మరుసటి ఏడాది కుమార్తె నిష్కా జన్మించారు. ఆమె అంటే తారక రత్నకు ప్రాణం. ఆమెతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవారు. కుమార్తె ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.
Also Read : విలన్‌గా నంది అవార్డు - హీరోగా ఒక్క రోజు 9 సినిమాలకు క్లాప్ కొట్టిన తారకరత్న