అన్వేషించండి

Nadigar Sangam: కేరళ ఎఫెక్ట్‌ - కోలీవుడ్‌లో మహిళల రక్షణకు కమిటీ- అధ్యక్షురాలిగా నటి రోహిణి

Kollywood News | తమిళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు నడిగర్‌ సంఘం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సీనియర్‌ నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించింది.

Nadigar Sangam: మలయాళ చిత్రపరిశ్రమలో నటీమణులపై వేధింపులకు సంబంధించి జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక దేశ్యాప్తంగా అలజడి రేగింది. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ముందస్తు చర్యలు చేపట్టింది. కోలీవుడ్‌లో మహిళల రక్షణకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేసింది సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నడిగర్‌ సంఘం. ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించింది.

నడిగర్ సంఘం(Nadigar Sangam) 68వ జనరల్ కౌన్సిల్ సమావేశం ఆదివారం (సెప్టెంబర్‌ 8వ తేదీ) చెన్నై(Chennai)లోని కామరాజర్ అరంగంలో జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు. జనరల్ కౌన్సిల్ సమావేశంలో నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్(Vishal), కోశాధికారి నాసర్(Nasser), కార్తీ(Karthi)తోపాటు పలువురు పాల్గొన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ తెలిపారు. రోహిణి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. రోహిణీ(Rohini)తోపాటు మరో నటి సుహాసిని (Suhasini) ఈ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. నడిగర్‌ సంఘంలో సభ్యత్వం లేని వారైనా సరే... ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. సీనియర్‌ యాక్టర్‌, కొత్త నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌.. ఇలా ఎవరిపై ఫిర్యాదు వచ్చినా... తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. 

నాజర్‌ ఏమన్నారంటే.. 
ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల సమస్యను చాలా సీరియస్‌గా తీసుకున్నామని అన్నారు నడిగర్‌ సంఘం ప్రెసిడెంట్‌, నటుడు నాజర్‌. అందుకే కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీలో న్యాయవాదులు కూడా ఉంటారన్నారు. ఇది తమ తొలి అడుగు అని చెప్పారు నాజర్‌. ఇండస్ట్రీలో పనిచేసే మహిళలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. 

రోహిణి ఏమన్నారంటే...
జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్(Justice Hema Committee)‌... దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తమకు ఎదురైన వేధింపుల గురించి నటీమణులు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ అంశంపై నటి రోహిణి కీలక వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా... మీడియా ముందు మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయాజనం ఉండదన్నారు. ఇక.. 2019 నుంచి నడిగర్‌ సంఘంలో అంతర్గత కమిటీ పని చేస్తోంది కానీ... అంత చురుకుగా లేదు. దీంతో... రోహిణి అధ్యక్షత కమిటీని నియమించారు. మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావాలని రోహిణి కోరారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరస్తులపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తారు. బాధితులకు న్యాయ సహాయం అందేలా చూస్తామని నాడిగర్‌ సంఘం తెలిపింది. 

Also Read: Emergency Movie: ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్‌ పూర్తి- ఆ సీన్లు కట్, కండీషన్లు అప్లై

జస్టిస్‌ హేమ కమిటీలో ఏముంది...?
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, వేధింపులను తెలుపుతూ... జస్టిస్‌ హే కమిటీ... ఒక నివేదికను తయారు చేసి కేరళ(Kerala) ప్రభుత్వానికి అందించింది. పనితీరు, రెమ్యునరేషన్‌, సాంకేతి రంగంలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. క్యాస్టింగ్‌ కౌచ్‌ మొదలు.. వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రిపోర్టులో పేర్పొంది. ఈ రిపోర్ట్‌ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో... నటీమణులు బయటకు వచ్చి... తమకు ఎదురైన చేదు అనుభవాలు, వేధింపులను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో... ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌, నటుడు జయసూర్య, మణియన్‌ పిళ్లరాజుపై కేసులు కూడా కేసులు నమోదయ్యాయి. మాలీవుడ్‌ తరహాలోనే... ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించింది నడిగర్‌ సంఘం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget