1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన లేటెస్ట్ సినిమా '1947 ఆగస్టు 16'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. ఆయన మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'స్టాలిన్', సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'స్పైడర్' చిత్రాలు తీశారు. 'ఠాగూర్' కథ కూడా ఆయనదే. మురుగదాస్ దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా! ప్రతిభావంతులైన యువకులతో మాంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన తాజా సినిమా '1947 ఆగస్టు 16'.
'1947 ఆగస్టు 16'లో గౌతమ్ కార్తీక్ హీరో. ఈయన 'అభినందన' ఫేమ్, తమిళ హీరో కార్తీక్ కుమారుడు. గౌతమ్ కార్తీక్‌తో గతంలో 'రంగూన్' అని ఏఆర్ మురుగదాస్ ఒక సినిమా నిర్మించారు. '1947 ఆగస్టు 16' రెండో సినిమా. నేడు సినిమా ఫస్ట్ లుక్‌ను శివ కార్తికేయన్ విడుదల చేశారు. హీరో సహా ఇతర పాత్రధారులు అందరూ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. కొండ అంచున ఉండి ఏదో గమనిస్తునట్టు ఉన్నారు.
భారత దేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్య్రం వచ్చింది. ఆ మర్నాడు ఏం జరిగిందనే కథతో '1947 ఆగస్టు 16' తెరకెక్కించినట్టు ఉన్నారు. ఫస్ట్ లుక్ చూస్తే... స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యువకుడిలా గౌతమ్ కార్తీక్ ఉన్నారు.
Happy to release the First look of #1947August16 produced by director @Armurugadoss sir in association with @purplebullent All the best to the team😊👍@NsPonkumar @Gautham_Karthik @RevathySharma @vijaytvpugazhO @iomprakashbhatt @adityajeee @khanwacky @RSeanRoland@selvakumarskdop pic.twitter.com/T3rLB0Yuf1
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) May 25, 2022
పీరియడ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా గురించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరితో కలిసి ఏఆర్ మురుగదాస్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకుడు.
Also Read: రష్మికకు అదొక సెంటిమెంట్ - ఆమె ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా షెడ్యూల్‌లో అది కామన్
View this post on Instagram