Euphoria: గుణశేఖర్ 'యుఫోరియా'లో తమిళ స్టార్ డైరెక్టర్ - ఆ వార్తల్లో నిజం ఎంతంటే?
Gautham Vasudev Menon: దర్శకుడు గుణశేఖర్ లేటెస్ట్ మూవీ 'యుఫోరియా' మూవీపై ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రముఖ తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Tamil Director Vasudev Menon Plays A Key Role In Guna Sekhar's Euphoria: దర్శకుడు గుణశేఖర్ (Guna Sekhar).. సమంత శాకుంతలం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'యుఫోరియా' (Euphoria) అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. గుణశేఖర్ హోమ్ బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్‌పై తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రముఖ తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'యుఫోరియా'లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన పాత్రపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీన్ని మూవీ టీం ధ్రువీకరించాల్సి ఉంది. ఈ మూవీలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమం;చలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూర్చారు.
Also Read: 'ఛావా' ఫస్ట్ రివ్యూ - నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్‌లో భారీ హిట్టు కొట్టిందా?
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ కాంబో
కాగా, దాదాపు 20 ఏళ్ల తర్వాత దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ భూమిక కాంబో రిపీట్ అవుతుండగా.. 'యుఫోరియా' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సరికొత్త కథాంశంతో గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా ఈ 'యుఫోరియా' మూవీ తెరకెక్కుతున్నట్టు టాక్ నడుస్తోంది. గతంలో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'ఒక్కడు' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు భూమికకు ఈ మూవీ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ రేంజ్‌లో ఒక్క హిట్ సైతం గుణశేఖర్ ఖాతాలో పడలేదు. నిజానికి ఆయన సమంత 'శాకుంతలం' సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని మరీ 'యుఫోరియా'ను ప్రకటించారు. మరి ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ.. భూమిక, గుణశేఖర్ కాంబో హిట్ మళ్లీ రిపీట్ అవుతుందో లేదో అనేది చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

