అన్వేషించండి

Meetha Raghunath: ‘గుడ్‌ నైట్’ హీరోయిన్ మీథా ఎంగేజ్‌మెంట్ - ఫొటోలు వైరల్

గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో పెళ్లిగోల మొదలయ్యింది. తాజాగా ఒక తమిళ హీరోయిన్ కూడా సింపుల్‌గా, ఏ హడావిడి లేకుండా ఎంగేజ్‌మెంట్ చేసుకుందని తెలుస్తోంది.

‘గుడ్ నైట్’ మూవీలో ఎంతో అమాయకంగా కనిపించిన ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకునందని తెలుస్తోంది. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు షాకవుతున్నారు. అప్పుడే ఆమె పెళ్లి చేసుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనిపై ఆమె అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

ఊటీలో ఎంగేజ్‌మెంట్..

కేవలం హీరోయిన్‌గా రెండు సినిమాలు మాత్రమే అనుభవం ఉన్న తమిళ నటి మీథా రఘునాథ్. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా సింపుల్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన రెండు ఫోటోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మీథా మాత్రం తన ఎంగేజ్‌మెంట్ గురించి ఫ్యాన్స్‌కు ఏ మాత్రం హింట్ ఇవ్వకపోవడంతో అసలు ఇది నిజమా, కాదా అని తన ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. మీథా సొంతూరు అయిన ఊటీలో ఎంగేజ్‌మెంట్ జరిగిందని, తనకు కాబోయే భర్త కూడా సినీ పరిశ్రమకు చెందినవాడే అని వార్తలు వినిపిస్తున్నాయి.


Meetha Raghunath: ‘గుడ్‌ నైట్’ హీరోయిన్ మీథా ఎంగేజ్‌మెంట్ - ఫొటోలు వైరల్

సింపుల్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా..
ముందుగా 2022లో ‘ముదల్ నీ ముడివుమ్ నీ’ అనే సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యింది మీథా రఘునాథ్. అందరూ కొత్త నటీనటులతో, కొత్త దర్శకుడితో తెరకెక్కిన ఈ చిత్రం.. థియేటర్లలో విడులదయినప్పుడు కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే రీచ్ అయ్యింది. కానీ ఓటీటీలో విడుదలయిన తర్వాత కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సౌత్ మూవీ లవర్స్ అంతా ఈ చిత్రాన్ని ఆదరించడం మొదలుపెట్టారు. సింపుల్ స్టోరీతో, నేచురల్ యాక్టింగ్‌తో ‘ముదల్ నీ ముడివుమ్ నీ’ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో మొదటి సినిమాతోనే ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది మీథా.

‘గుడ్ నైట్’తో పాపులారిటీ..
‘ముదల్ నీ ముడివుమ్ నీ’ విడుదలయిన సంవత్సరం తర్వాత ‘గుడ్ నైట్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది మీథా రఘునాథ్. మొదటి సినిమాలోలాగానే ఇందులో కూడా ఒక పక్కింటామ్మాయి పాత్రలో సింపుల్‌గా కనిపించింది. ‘గుడ్ నైట్’ కోసం ‘జై భీమ్’ సినిమాలో తన యాక్టింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన మణికందన్‌తో జోడీకట్టింది మీథా. ఇటీవల హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం క్లీన్ హిట్‌ను సాధించింది. అంతే కాకుండా భార్య అంటే ఇలా ఉండాలి, చాలామందికి ఇలాంటి భార్య కావాలనే కోరిక ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో మీథా తెగ పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం మీథా తరువాతి ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ లేదు. ఇదే సమయంలో తన ఎంగేజ్‌మెంట్ అంటూ వచ్చిన వార్తలు.. తన ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తున్నాయి. కానీ తనంతట తానుగా ప్రకటించే వరకు ఈ వార్తలను నమ్మలేమని తన ఫ్యాన్స్ కొందరు భావిస్తున్నారు.

Also Read: 'సలార్' విడుదలకు వారం ముందు - 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ కొత్త సినిమా!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ అభిమానికి AAFA సాయం... సర్జరీ కోసం డబ్బులు, బన్నీ వాసు భరోసా
అల్లు అర్జున్ అభిమానికి AAFA సాయం... సర్జరీ కోసం డబ్బులు, బన్నీ వాసు భరోసా
Mouni Roy Disha Patani: ఎఫైర్ కాదు... దిశాతో రిలేషన్షిప్ గురించి మౌనీ రాయ్ క్లారిటీ
ఎఫైర్ కాదు... దిశాతో రిలేషన్షిప్ గురించి మౌనీ రాయ్ క్లారిటీ
Peddi: రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌కు నిరాశ... 'పెద్ది' విడుదలలో పెద్ద ట్విస్ట్
రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌కు నిరాశ... 'పెద్ది' విడుదలలో పెద్ద ట్విస్ట్
Drishyam 3 Collections: మంగళవారం పర్వాలేదు... స్టడీగా మోహన్ లాల్ 'దృశ్యం 3' కలెక్షన్లు - టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మంగళవారం పర్వాలేదు... స్టడీగా మోహన్ లాల్ 'దృశ్యం 3' కలెక్షన్లు - టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
PMUY Free Gas Cylinder Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏడాదికి 9 సిలిండర్లు, రూ.300 సబ్సిడీ.. PMUY అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇదే!
ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏడాదికి 9 సిలిండర్లు, రూ.300 సబ్సిడీ.. PMUY అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇదే!
Puffy Face in the Morning : ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే
ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
IPL 2027 Captain Retention:ఐపీఎల్‌ 2027 కెప్టెన్సీ లాక్‌; ఫ్రాంచైజీల నమ్మకాన్ని గెలిచిన రియల్ కింగ్స్‌!
ఐపీఎల్‌ 2027 కెప్టెన్సీ లాక్‌; ఫ్రాంచైజీల నమ్మకాన్ని గెలిచిన రియల్ కింగ్స్‌!
Embed widget