Taapsee Pannu: నా భర్త మాథియాస్‌కు ముందు చాలామందితో డేటింగ్ చేశాను - తాప్సీ షాకింగ్ కామెంట్స్
Taapsee About Her Love Story: హీరోయిన్ తాప్సీ పోన్ను తన లవ్‌స్టోరి గురించి చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మాథియాస్‌తో రిలేషన్ కంటే ముందు చాలా మంది బాయ్స్‌తో డేటింగ్ చేశానంది.
Taapsee Pannu About Her Love Story with Mathias Boe: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. గ్లామర్ రోల్స్‌తో పాటు లేడీ ఒరియంటెడ్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ మాథియాస్ బోతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా రిలేషన్‌లో ఉన్న ఆమె ఈ ఏడాది అతడితో పెళ్లీ పీటలు ఎక్కింది. ఎలాంటి ప్రకటన, హడావుడి లేకుండా సీక్రెట్‌గా రాజాస్థాన్ ఉదయపూర్‌లో వీరి పెళ్లి జరిగింది.
వివాహ అనంతరం కూడా తాప్సీ ఫోటోలు,పోస్ట్స్ ఏం చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చిన ఆమె పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త మాథియాస్ బో తనకు ఫస్ట్ లవ్ కాదని, అంతకు ముందు చాలామందితో రిలేషన్ ఉన్నానని చెప్పి షాకిచ్చింది. "మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మథియాస్‌ని చూసినప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ ఏం కలగలేదు. కానీ అతడితో పరిచయం ప్రత్యేకంగా అనిపించింది. అతను అథ్లెట్, ఒలింపిక్స్‌లో మొదట గెలిచిన వ్యక్తి అని అనుకున్నాను. దేశం కోసం ఆడే అథ్లెట్లను చూస్తే డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఎలాంటి పరిస్థితులకు ప్రభావితం కాకుండా ఒత్తిడిలోనూ ఆడటమంటే చిన్న విషయం కాదు. అయితే మాది మొదటి చూపులో కలిగిన ప్రేమ కాదు.
మాథియాస్‌పై ప్రేమ పుట్టేవరకు తరచూ అతడిని కలుస్తూనే ఉన్నాను. ఈ క్రమంలో తనని చాలా పరీక్షించాను. మాది ప్రేమ, కాదా? మా మధ్య ప్రేమ వర్కౌట్ అవుతుందా? తననతో రిలేషన్ సాధ్యమేనా? ఇలా అన్ని విధాలుగా నన్ను పరీక్షించుకున్నాను. తనపై గౌరవం, అభిమానం ఉన్న రిలేషన్ కోసం చాలా టైం తీసుకున్నా. అయితే నా పరీక్షలో మాథియాస్ గెలిచాడు. చివరికి ఓ రోజు ఒకే చెప్పాను" అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మాట్లాడుతూ.. "మాథియాస్‌ని కలిసినప్పుడు నాకు స్పెషల్‌గా అనిపించింది. కానీ అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది కాదు. అప్పుడు నాకు తనపై ఓ గౌరవం మాత్రమే ఉంది. కానీ మథియాస్ కంటే ముందు నేను చాలా మంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. కానీ మాథియాస్ మాత్రం అంతకుముందు ఎవరితో డేటింగ్ చేయలేదు.
Also Read: నిర్మాతగానే కాదు నటుడిగా వెండితెరపై అలరించిన రామోజీ రావు - ఆయన నటించిన సినిమా ఇదే..
ఆ విషయంలోనే తనపై నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. అందుకే మెచ్యూరిటీగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. తరచూ మాథియాస్ కలుస్తూ తనని అర్థం చేసుకునేందుకు ట్రై చేశా. తనపై నాకు చాలా రోజుల తర్వాత క్లారిటీ వచ్చింది. అప్పుడు తనే నా సోల్‌మేట్ అని ఫిక్స్ అయ్యాను. తనకి ఓకే చెప్పి రిలేషన్‌లో ఉన్నాం. ఫైనల్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాం" అటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ ఏడాది మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కేవలం కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో తాప్సీ, మాథియాస్‌ల పెళ్లి వేడుక జరిగింది. ఎలాంటి సమాచారం లేకుండ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత కూడా సైలెంట్‌గా ఉంది. కనీసం పెళ్లి ఫోటోలు కూడా రివీల్ చేయలేదు.