Ramoji Rao: నిర్మాతగానే కాదు నటుడిగా వెండితెరపై అలరించిన రామోజీ రావు - ఆయన నటించిన సినిమా ఇదే..
Ramoji Rao Acted in a Movie: నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించిన ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిని రామోజీరావు కూడా ఓ సినిమాలో నటించారు తెలుసా? ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రంలో ఆయన కీ రోల్ పోషించారు.
Ramoji Rao Acted in NTR Starer Marpu Movie: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలుగా మీడియా రంగంలో అగ్రగామిగా ఉన్నారు. వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఆయన అడుగుపెట్టని అన్ని రంగాల్లోనూ సక్సెస్ సాధించి టాప్ నిలిచారు. మీడియా మోఘల్‌గా దేశవ్యాప్తంగా ఎంతో కీర్తి గడించిన ఆయన నేడు దివికేగారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జూన్ 8 తెల్లారు జామున కన్నుమూశారు.
ఈనాడు వార్త పత్రికను స్థాపించి ఆ తర్వాత మీడియాలో రంగంలో అంచలెంచలు ఎదిగి అగ్రస్థానంలో నిలిచిన ఆయన ఉషా కిరణ్ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఉషా కిరణ్ మూవీస్‌లో ఎన్నో సినమాలు,సీరియల్స్ తెరకెక్కించి నిర్మాత మారారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే. ఎన్టీఆర్‌తో పాటు ఎంతో మంది నటీనటులు, దర్శకులు, టెక్నిషియన్లను పరిచయం చేశారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకం దాదాపు 87 సినిమాలు నిర్మించిన ఆయన వెండితెరపై కూడా అలరించారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సినీరంగంలో నిర్మాతగా తన తొడ్పపాటు మాత్రం ఇచ్చారనుకుంటున్నారు.
కానీ ఆయన ఓ సినిమాలో నటించి వెండితెరపై అలరించారు కూడా. అది కూడా అతిథి పాత్రలో. అయినా కూడా రామోజీరావు నటించిన పాత్రను పత్రికల్లోనూ ప్రచురించడం విశేషం. ఇంతకి ఆ సినిమా ఏంటంటే ‘మార్పు’. యు.విశ్వేశ్వర రావు దర్శకత్వంలో 1978 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్రను పోషించారు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. ఇందులో శ్రీధర్, మాధవి ప్రధాన పాత్రలు పోషించారు. నటసార్వభౌముడు ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంలో ఓ అతిథి పాత్ర చేశారు. ఇదే సినిమాలో రామోజీరావు న్యాయమూర్తిగా వెండితెరపై కనిపించారు. చేసింది అతిథి పాత్ర, కనిపించింది కాసేపే అయినా కూడా ఆ సమయంలో మూవీ టీం ఆయన ఫోటోలతో పోస్టర్లు కూడా వేసి ప్రమోషన్స్ చేయడం విశేషం.
నిర్మాతగా రామోజీరావుకు శ్రీవారికి ప్రేమలేఖ (1984) తొలి చిత్రం. ఆ తర్వాత వరసుగా సినిమాలు నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఒక్క తెలుగులోనే కాదు వివిధ భాషల్లోనూ ఆయన సినిమాలు నిర్మించారు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. చివరిగా తెలుగులో ఆయన 'దాగుడుమూతల దండాకోర్' (2015) అనే చిత్రాన్ని నిర్మించారు. నేడు మరణించిన రామోజీ పార్థివదేహానికి సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం, ఇచ్చిన సపోర్టును గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అయితే ఆయన పార్థివదేహం ముందు బోరున విలపించారు. ఇక దర్శకధరీఉడు రాజమౌళి, రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్‌తో, మోహన్ బాబు ఇలా పలువురు ప్రముఖులు ఆయన మ్రతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో స్టార్ హీరోలకు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆయనకు నివాళిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి రేపు షూటింగ్స్‌కు సెలవు ప్రకటించింది. రామోజీరావు మృతికి సంతాపంగా రేపు (జూన్ 9) టాలీవుడ్‍లో సినిమా షూటింగ్‍లు బంద్ చేస్తున్నట్టు సినీ నిర్మాతల మండలి అధికారిక ప్రకటన ఇచ్చింది.