Ramoji Rao: ఆయన మానసిక క్షోభ అనుభవించి వెళ్లారు, అది ఆ భగవంతుడు చూసుకుంటాడు - రామోజీ మృతిపై రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
Ramoji Rao Death: రామోజీ రావు మరణంపై రాజేంద్రప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. చివరి రోజుల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించారంటూ కన్నీరు పట్టుకున్నారు. ఎన్టీఆర్ కూడా రామోజీకి నివాళులు అర్పించారు.
Rajendra Prasad Emotional On Ramoji Rao Death: అక్షర యోధు, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నఆయన ఇవాళ (జూన్ 8) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ, మీడియా రంగంలో విషాదం నెలకొంది. ఇక ఆయన మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా రామోజీ రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు.
అలాగే నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "రామోజీరావు దైవ సన్నిధిలోకి వెళ్లిన సందర్భంగా ఆయన గురించి ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంతటి మాహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మనసికక్షోభ అనుభవించి వెళ్లారు. అది భగవంతుడు చూసుకుంటాడు. చూసుకున్నాడు కూడా. కానీ ఆయన ఆ నిజ గెలుపుని అనుభవించి, ఆ సక్సెస్‌ని ఆయన చూసే వెళ్లారు. ఆయన అనుకున్నది సాధించే వెళ్లారు. ప్రపంచం బతికున్నంతవరకు కొంతమందే బ్రతికుంటారు. అందులో శ్రీ రామోజీరావు ఒకరు. ఆయన ఒక చరిత్ర" అంటూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: నాకు లైఫ్ ఇచ్చింది రామోజీరావే, ఈ రోజు షూటింగ్స్ కొనసాగిస్తాం - బోరున ఏడ్చేసిన యమున
అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వేదికగా నివాళులు అర్పించారు. "శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
— Jr NTR (@tarak9999) June 8, 2024
‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm
రండి.. నా సమాధి చూద్దురు అనేవారు: మోహన్ బాబు
అలాగే రామోజీరావు పార్థివదేహాన్ని విలక్షణ నటుడు మోహన్ బాబు సందర్శించారు. అనంతరం ఆయన మీడియా ఎదుట మాట్లాడారు. ఆయనతో నాకు 42 ఏళ్ల అనుభవం ఉంది. ఎప్పుడు ఆయన నాకు, నేను ఆయనకు ఫోన్ చేస్తు ఉండేవాళ్లం. ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆయనతో ఎప్పుడు మట్లాడిని మంచి విషయాలను చెప్పేవారు. ఎప్పుడూ సమాజం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారనే ఆలోచించేవారు. తాను జీవితమే ప్రజల కోసమని, వాళ్ల కష్టాసుఖాలు తెలుసుకుని నా వంతు వారికి ఏం చేయగలను అని ఎప్పుడు చెబుతుండేవారు. ఎప్పుడు కలిసిన రెండు గంటల వరకు నన్ను విడిచిపెట్టేవారు కాదు. రండి! ఎప్పుడైన నేను చనిపోతే నా సమాధి చూద్దురు అనేవారు. ఏవండి నేను మిమ్మల్ని పలకరించడానికి వచ్చాను కానీ, మీ సమాధి నేన ఎందుకు చూడాలి అనే వాడిని. మీరు బాగుండాలని అనేవాడిని. ఆయన మరణం యావత్ ప్రపంచానికి తీరని లోటు" అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.