Taapsee Pannu: రాత్రి 10 తర్వాత అక్కడికి వెళ్లాలి, అవకాశాల కోసం అలా చెయ్యలేను - బాలీవుడ్ ఛాన్సులపై తాప్సీ షాకింగ్ కామెంట్స్
Taapsee Pannu: బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన తాప్సీ.. తనకు నచ్చని విషయం గురించి ముక్కుసూటిగా చెప్పేస్తుంది. తాజాగా బీ టౌన్‌లో భారీ బడ్జెట్ సినిమా అవకాశాలు రావాలంటే ఏం చేయాలో బయటపెట్టింది.
Taapsee Pannu about Bollywood: బాలీవుడ్‌లో తనకు నచ్చింది నచ్చినట్టుగా మాట్లాడుతూ, కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ చేస్తూ.. ఒక కాంట్రవర్షియల్ క్వీన్‌గా మారిపోయింది తాప్సీ పన్ను. టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ.. సందర్భం వచ్చినప్పుడల్లా టాలీవుడ్‌పై మాత్రమే కాదు.. బాలీవుడ్‌పై కూడా విమర్శలు కురిపిస్తుంది. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా’ ప్రమోషన్స్ సందర్భంగా బాలీవుడ్‌పై విమర్శలు కురిపించింది ఈ భామ. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. బీ టౌన్ కల్చర్ గురించి, లేట్ నైట్ పార్టీల గురించి వ్యాఖ్యలు చేసింది.
అవకాశం ఇవ్వరు..
‘‘బాలీవుడ్‌లో గ్రూపులు ఉంటాయి. ఎప్పటినుండో ఇక్కడ నెపోటిజంపై చర్చ నడుస్తోంది. అలా నెపోటిజం ద్వారా వచ్చినవారు మాత్రమే ఈ గ్రూపుల్లో చేరగలరు. ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సమయంలో హీరోయిన్‌గా నా పేరు తెరపైకి వస్తే.. ఎవరూ నేను ఆ పాత్రకు సరిపోను అని కచ్చితంగా చెప్పరు. కానీ నేను ఆ గ్రూపుల్లో భాగం కాదు కాబట్టి నాకు ఆ అవకాశం ఇవ్వరు. ఆ గ్రూపుల్లో భాగమయిన మరో నటి చేతికి ఈ అవకాశం వెళ్తుంది. అలాంటి వారినే రికమెండ్ చేస్తారు. భారీ బడ్జెట్ సినిమా అవకాశాలు అనేవి కేవలం ఈ గ్రూపులకు యాక్సెస్ ఉంటేనే వస్తాయి. కానీ నాకు మాత్రం వాటికి యాక్సెస్ లేదు’’ అంటూ ముక్కుసూటిగా తనకు భారీ బడ్జెట్ సినిమాల అవకాశాలు అందుకే రావడం లేదంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
ఆ టైప్ కాదు..
‘‘పార్టీలు కూడా ఈ బాలీవుడ్ గ్రూపుల్లోకి చేరడానికి దారి చూపిస్తాయి. మనుషులను కలవడం ద్వారా వారితో ఫ్రెండ్‌షిప్ ఏర్పడి అవకాశాలను దక్కించుకోవచ్చు. అవకాశాలు దక్కాలంటే ముందుగా రాత్రి 10 గంటల తర్వాత పార్టీలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. అదంతా నా వల్ల కాదు. నేను దానిని భరించలేను. అది నేను కాదు. నేను మంచి సినిమాలు చేయడానికి కష్టమైన దారిని ఎంచుకున్నాననే చెప్పాలి’’ అంటూ బాలీవుడ్‌లో లైట్ నైట్ పార్టీ కల్చర్ గురించి బయటపెట్టింది తాప్సీ. తనకు పార్టీలు చేసుకోవడం లాంటివి ఇష్టముండదు అని, వాటన్నింటికీ దూరంగా ఉంటానని ఇప్పటికే తాప్సీ పలు సందర్భాల్లో బయటపెట్టింది.
సినిమాలతో బిజీ..
ప్రస్తుతం తాప్సీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఎప్పుడూ కంటెంట్‌నే నమ్ముకుంటూ ముందుకు వెళ్లే ఈ భామ.. స్టార్ హీరోలతో కలిసి నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించదు. కథ, కంటెంట్ బాగుంటే అప్‌కమింగ్ హీరోతో జోడీకట్టడానికి అయినా రెడీ అంటుంది. ఇక విక్రాంత్ మాస్సేతో జోడీకడుతూ తాప్సీ నటించిన ‘హసీన్ దిల్‌రుబా’ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీంతో పాటు ‘వో లడ్కీ హై కహా’ సినిమాలో ప్రతీక్ గాంధీ సరసన నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘ఖేల్ ఖేల్ మే’లో కూడా తాప్సీ హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ మూవీలో తనతో పాటు వాణి కపూర్ కూడా మరో హీరోయిన్‌గా కనిపించనుంది.
Also Read: పూజాకు మరో బంపర్ ఆఫర్ - బాలీవుడ్ యంగ్ హీరోతో బుట్టబొమ్మ రొమాన్స్!