అన్వేషించండి

Taapsee Pannu Marriage: సీక్రెట్‌గా తాప్సీ పెళ్లి - ఇంతకీ ఆమె భర్త ఏం చేస్తాడో తెలుసా?

Taapsee Pannu: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యి బాలీవుడ్‌లో స్టార్‌గా సెటిల్ అయిపోయిన తాప్సీ.. తన బాయ్‌ఫ్రెండ్ మథియాస్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. ఇంతకీ మథియాస్ ఎవరంటే..

Who Is Taapsee Pannu Husband: గత రెండేళ్లలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. వీరి పెళ్లిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నా కూడా దాని గురించి ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పెళ్లి తంతు అంతా పూర్తయిన తర్వాత.. అప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి తాప్సీ కూడా యాడ్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలలాగానే తాప్సీ కూడా ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందని బాలీవుడ్ సర్కిల్స్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ తాప్సీ పెళ్లి చేసుకుంది ఎవరిని అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.

11 ఏళ్ల ప్రేమ..

ఉదయ్‌పూర్‌లో తాప్సీ పెళ్లి పనులు గత బుధవారమే మొదలయ్యాయని బాలీవుడ్ మీడియా చెప్తోంది. అందులో కేవలం తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారని తెలుస్తోంది. తాప్సీ.. ఎప్పుడూ తన రిలేషన్ స్టేటస్ గురించి సీక్రెట్‌గా దాచిపెట్టలేదు. తను బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉంది. 2013లో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో మొదటిసారిగా తాప్సీ, మథియాస్ కలిశారు. అప్పుడే వారు ప్రేమలోపడ్డారు. అప్పటినుండి వీరు ఈ హ్యాపీ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో వీరి పెళ్లి గురించి చాలాసార్లు తాప్సీకి ప్రశ్నలు ఎదురవ్వగా తను ఘాటుగా స్పందించింది. ఫైనల్‌గా ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసేసుకుంది.

మథియాస్ బో ఎవరంటే.?

మథియాస్ బో ఒక మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్. తను ప్లేయర్‌గా రాణిస్తున్న సమయంలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. తను ఒలింపిక్స్‌లో మెడల్ సాధించాడు. ప్రపంచ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ బ్యాడ్మింటన్ నేషనల్ టీమ్‌కు కోచ్‌గా పనిచేస్తున్నాడు. 2020లో ఒక పోస్ట్‌తో తాప్సీతో రిలేషన్ గురించి బయటపడింది. తాప్సీ సన్నిహితులు మథియాస్‌తో జరిగిన వివాహం గురించి బయటపెట్టారు. ‘‘ఉదయ్‌పూర్‌లో చాలా తక్కువమంది మధ్యలో పెళ్లి జరిగింది. మార్చి 20న పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. వారిద్దరికీ మీడియా అటెన్షన్ అవసరం లేదని నిర్ణయించుకొని ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mathias Boe (@mathias.boe)

వారంతా హాజరు..

బాలీవుడ్ నుండి కొందరు ప్రముఖులు మాత్రమే తాప్సీ, మథియాస్ పెళ్లికి హాజరు అయినట్టు తెలుస్తోంది. తాప్సీ పన్నుతో కలిసి ‘దొబారా’, ‘తప్పడ్’ లాంటి చిత్రాల్లో నటించిన పవైల్ గులాటి.. ఈ పెళ్లికి హాజరు అయినట్టు సమాచారం. తనతో పాటు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కనికా ధిల్లోన్, తన భర్త హిమాన్షు శర్మ.. ఈ పెళ్లికి వచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుకల మొదలయ్యే కొన్నిరోజుల ముందే తాప్సీ చివరిసారిగా ఫోటోగ్రాఫర్ల ముందుకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్స్ అయిన గౌరీ, నైనికా షోలో షో స్టాపర్‌గా కనిపించింది. ఆ తర్వాత పెళ్లి వేడుకల కోసం ఉదయ్‌పూర్ వెళ్లిపోయినట్టు సమాచారం. 

Also Read: ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ప్రయాణమయిన అల్లు అర్జున్ - అందుకోసమే?

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget