అన్వేషించండి

Allu Arjun: ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ప్రయాణమయిన అల్లు అర్జున్ - అందుకోసమే?

Allu Arjun: ఇప్పటికే దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పలువురు సౌత్ నటీనటుల వ్యాక్స్ విగ్రహాలు ఆవిష్కరణ జరిగాయి. ఆ లిస్ట్‌లోకి బన్నీ కూడా చేరనున్నాడు. దానికోసమే ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు.

Allu Arjun: టాలీవుడ్ హీరోలంతా తమకు సమయం కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ప్రయాణమయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో ‘పుష్ప ది రూల్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. తాజాగా దాని నుండి షార్ట్ బ్రేక్ తీసుకున్నాడు. దుబాయ్ వెళ్తూ ఫ్యామిలీతో సహా ఎయిర్‌పోర్టులో కనిపించాడు. దీంతో ఫోటోగ్రాఫర్లు అల్లు వారి ఫ్యామిలీ ఫోటోను క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇంకా ‘పుష్ప’ షూటింగ్ కొనసాగుతుండడంతో అల్లు అర్జున్ ఇంకా గడ్డంతో రఫ్ లుక్‌లోనే ఉన్నాడు.

దుబాయ్‌లో అల్లు అర్జున్ విగ్రహం..

‘పుష్ప’ కంటే ముందు కూడా అల్లు అర్జున్‌కు చాలానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తన ఫ్యాన్స్ అంతా కలిసి ఈ హీరోకు స్టైలిష్ స్టార్ అని పేరు కూడా పెట్టుకున్నారు. కానీ ‘పుష్ప’ సినిమా.. తనను ఐకాన్ స్టార్‌ను చేసింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజంను, డైలాగులను ఇమిటేట్ చేశారు సెలబ్రిటీలు. దీంతో బన్నీ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. అందుకే దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ వ్యాక్స్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమయ్యింది. మార్చి 28 రాత్రి 8 గంటలకు ఈ విగ్రహం ఆవిష్కరించనున్నాడు ఈ హీరో. దానికోసమే కుటుంబంతో కలిసి దుబాయ్ ప్రయాణమయ్యాడు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డ్..

ఇప్పటికే దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఎంతోమంది సౌత్ నటీనటులు వ్యాక్స్ విగ్రహాలు ఉన్నాయి. ‘బాహుబలి’తో ఫేమ్ సంపాదించుకున్నందుకు ప్రభాస్ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి అల్లు అర్జున్ కూడా చేరనున్నాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ సాధిస్తున్న ఘనత చూస్తూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా కూడా బన్నీ రికార్డ్ దక్కించుకున్నాడు. మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే బన్నీ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. తనకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్‌ను ఫ్యాన్స్‌కు అందిస్తూ ఉంటాడు.

మేకర్స్‌పై ఆగ్రహం..

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన వ్యాక్స్ విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత తిరిగి మళ్లీ ‘పుష్ప 2’ షూటింగ్‌లో పాల్గోనున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లొకేషన్ నుండి ఫోటోలు లీక్ అవుతున్నాయని, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కావడం లేదని మేకర్స్‌పై కోపంగా ఉన్నాడట బన్నీ. ఇక ఎలా అయినా ‘పుష్ప 2’ను ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ ఫిక్స్ అయ్యింది. ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్.. ‘పుష్ప 2’ను మరింత భారీ ఎత్తున నిర్మిస్తోంది. 

Also Read: ‘కల్కి 2898 AD’లో నా క్యారెక్టర్ అదే, ఇండియన్ 2 మాత్రమే 3 కూడా పూర్తయ్యింది - కమల్ హాసన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget