By: ABP Desam | Updated at : 06 Jun 2023 02:30 PM (IST)
ఫహాద్ జరార్ అహ్మద్, స్వరా భాస్కర్ (Image Courtesy : reallyswara/Instagram)
హిందీ నటి స్వరా భాస్కర్ (Swara Bhaskar) ఈ రోజు నెటిజనులను సర్‌ప్రైజ్ చేశారు. ఆమె అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. మూడు నెలల క్రితం సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్ (Fahad Zirar Ahmed)ను స్వరా భాస్కర్ పెళ్లి చేసుకున్నారు. తొలుత కోర్టు ద్వారా రహస్య వివాహం చేసుకుని ఆ తర్వాత మార్చిలో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అది ఉత్తరాది ప్రేక్షకులకు, ముంబై సినిమా జనాలకు పెద్ద సర్‌ప్రైజ్ అంటే... ఈ రోజు అంత కంటే పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం తాను గర్భవతినని వెల్లడించారు. బేబీ బంప్ ఫోటోలు కూడా పోస్ట్ చేశారు.
కొత్త ప్రపంచంలోకి... అక్టోబర్ బేబీ!
''కొన్నిసార్లు మన ప్రార్థనలు అన్నీ ఫలిస్తాయి. భగవంతుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఇదొక గొప్ప అనుభూతి. ఎగ్జైటెడ్ గా ఉన్నాం'' అని భర్తతో కలిసి దిగిన ఫోటోలను స్వరా భాస్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో బేబీ బంప్ స్పష్టంగా కనబడుతోంది.
తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి (చిన్నారి) వస్తున్న విషయాన్ని స్వరా భాస్కర్ ఈ విధంగా వెల్లడించారు. మరొక విషయం ఏమిటంటే... డెలివరీ ఎప్పుడు? బిడ్డ భూమి మీదకు వచ్చేది ఎప్పుడు? అనేది కూడా ఆమె చెప్పేశారు. 'అక్టోబర్ బేబీ' అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. దాన్ని బట్టి అక్టోబర్ నెలలో డెలివరీ అని చెప్పవచ్చు. స్వరా భాస్కర్ తాను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్ళైన మూడు నెలలకు స్వరా భాస్కర్ ఈ గుడ్ షేర్ చేశారు.
Also Read : పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్ వెబ్ సిరీస్ టీజర్!
ఫహాద్... స్వర... ప్రేమలో ఎలా పడ్డారు?
రాజకీయ నేతతో స్వరా భాస్కర్ ఎలా ప్రేమలో పడ్డారు? అని ప్రేక్షకులు చాలా మంది ఆశ్చర్యపోయారు. వాళ్ళ కోసమే అన్నట్లు పెళ్లి సందర్భంగా తమ పరిచయం, ప్రేమ గురించి స్వరా భాస్కర్ ఓ నోట్ విడుదల చేశారు. ''కొన్ని సార్లు మన పక్కనే ఉన్న వాటి కోసం మనం చాలా దూరం వెతుకుతాం. మేం ప్రేమ కోసం వెతికాం. అయితే, మొదట మా మధ్య స్నేహం ఉందని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ప్రేమలో పడ్డాం. నా హృదయంలోకి ఫహాద్ జరార్ అహ్మద్ కు స్వాగతం. నా హృదయం కొంచెం గందరగోళంగా ఉంటుంది. కానీ అది నీదే'' అని స్వరా భాస్కర్ పోస్ట్ చేశారు.
తెలుగు మూలాలు ఉన్న అమ్మాయే
స్వరా భాస్కర్ తల్లి బీహార్ రాష్ట్రానికి చెందిన మహిళ. అయితే, ఆమె తండ్రి నేవీ ఉద్యోగి ఉదయ్ భాస్కర్ తెలుగు వారే. అయితే, ఆమె పుట్టింది, పెరిగింది అంతా ఢిల్లీలోనే! ఫహాద్ జరార్ అహ్మద్ తో వివాహం కంటే ముందు రచయిత హిమాన్షు శర్మతో స్వరా భాస్కర్ కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నారని హిందీ చిత్రసీమ వర్గాలు చెబుతాయి. 'రాంఝనా' చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య మొదలైన పరిచయం ఆ తర్వాత సహ జీవనానికి దారి తీసిందని టాక్. ఐదేళ్ళ డేటింగ్ తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోయారు.
Also Read : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు - స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!
Siddharth: పద్ధతిగా కూర్చొని ప్రశ్నలు అడగమనండి - ఆ జర్నలిస్ట్‌కు సిద్ధార్థ్ స్ట్రాంగ్ వార్నింగ్
'హాయ్ నాన్న' నుంచి సెకండ్ సింగిల్ - 'గాజు బొమ్మ' సాంగ్ ఎప్పుడంటే?
నా లైఫ్ నా ఇష్టం, వాటిని అస్సలు పట్టించుకోను - హృతిక్ రోషన్‌తో డేటింగ్‌పై సబా ఆజాద్ కామెంట్స్!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
/body>