అన్వేషించండి

Kanguva: సూర్య 'కంగువా' నుంచి క్రేజీ అప్డేట్ - ఏకంగా 38 భాషల్లో!

Kanguva Movie : కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న 'కంగువా' మూవీని ఏకంగా 38 భాషలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Suriya 'Kanguva' Latest Update : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హీరోగా నటిస్తున్న 'కంగువా'(Kanguva) మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారట. అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఇంతకీ 'కంగువా' మూవీని ఎన్ని భాషల్లో విడుదల చేస్తున్నారో తెలుసా? తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'. సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య మేకోవర్ అండ్ గెటప్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై సౌత్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కంగువా' గురించి నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ..

" సినిమా ప్రస్తుతం మేకింగ్ స్టేజ్ లో ఉంది. విడుదలకు భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కంగువా మూవీని ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఐమాక్స్, త్రీడీ వెర్షన్ లోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. తమిళ చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతోంది" అని అన్నారు. దీంతో జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ అయితే ఆయన కామెంట్స్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదే కనుక నిజమైతే పాన్ వరల్డ్ స్థాయిలో అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో సూర్య ఏకంగా ఆరు విభిన్న తరహా అవతారాల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని అంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే 'కంగువా' మూవీ ఏకంగా మూడు భాగాలుగా రాబోతోంది. పార్ట్-1 అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధిస్తే మిగతా భాగాలను తెరకెక్కించే ప్లాన్ లో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి 'కంగువా' పార్ట్-1 ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Also Read : ఊరమాస్ అవతార్‌లో వైష్ణవ్ తేజ్ - ‘ఆదికేశవ’ ట్రైలర్‌తో యాక్షన్ లవర్స్‌కు ఫుల్ ఫీస్ట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget