అన్వేషించండి

Aadikeshava Trailer: ఊరమాస్ అవతార్‌లో వైష్ణవ్ తేజ్ - ‘ఆదికేశవ’ ట్రైలర్‌తో యాక్షన్ లవర్స్‌కు ఫుల్ ఫీస్ట్!

Aadikeshava: వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ‘ఆదికేశవ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.

Aadikeshava Theatrical Trailer: వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆదికేశవ’ ట్రైలర్ రెండురోజుల ముందే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల చివరి నిమిషంలో ట్రైలర్ విడుదల వాయిదా పడిందంటూ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటించింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశపడ్డారు. కానీ ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది టీమ్. ఇప్పటికే ‘ఆదికేశవ’ కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టిన వైష్ణవ్ తేజ్.. ఈ సినిమా జోనర్ ఏంటో పలుమార్లు బయటపెట్టాడు. కానీ ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ గురించి మరింత క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు ప్రేక్షకులు.

క్యూట్‌‌నెస్‌తో కట్టిపడేస్తున్న శ్రీలీల..
‘పని, పాట లేకపోయినా మావాడు స్టైల్‌గా ఉంటాడు’ అంటూ ‘ఆదికేశవ’ ట్రైలర్‌లో ముందుగా వైష్ణవ్ తేజ్ క్యారెక్టర్ గురించి ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. అంతే కాకుండా హీరోది సరదాగా తిరిగే క్యారెక్టర్ అని, బాధ్యతలు లాంటివి తెలియవు అని కూడా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వైష్ణవ్ తేజ్ ఫ్రెండ్‌గా నటించిన సుధాకర్.. కామెడీ విషయంలో ప్రేక్షకులను అలరించేలా ఉన్నాడు. ఇక హీరోయిన్ శ్రీలీలతో వైష్ణవ్ తేజ్.. క్యూట్‌గా ఉండబోతుందని, హీరోయిన్ క్యారెక్టర్ కూడా క్యూట్‌గా యూత్‌ను కట్టిపడేయనుందని తెలుస్తోంది. ‘తిప్పుకుంటా, పెంచుకుంటా’ అంటూ శ్రీలీల చెప్పిన క్యూట్ క్యూట్ డైలాగులకు యూత్ మరోసారి ఫిదా అవ్వడం పక్కా అనిపిస్తోంది.

యాక్షన్ సీన్స్ అదుర్స్..
‘ఆదికేశవ’ ట్రైలర్‌లోని ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో సాగిపోయింది. మధ్యమధ్యలో కామెడీ కూడా ఆకట్టుకుంది. కానీ జోజూ జార్జ్ ఇంట్రడక్షన్‌తో ట్రైలర్ మరో మలుపు తిరిగింది. జాలి లేని విలన్ పాత్రలో జోజూ జార్జ్ ప్రేక్షకులను భయపెట్టేలా ఉన్నారు. మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న జోజూ.. తెలుగులో ‘ఆదికేశవ’తో గ్రాండ్‌గా డెబ్యూ ఇవ్వనున్నారు. అయితే ఆయన యాక్టింగ్ సత్తా ఏంటో ట్రైలర్‌లోనే ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. వైష్ణవ్ తేజ్ కూడా యాక్షన్ సీన్స్‌లో రెచ్చిపోయి మరీ నటించినట్టు కనిపిస్తోంది. తాను రుద్రకాలేశ్వరుడిని అంటూ చెప్పిన డైలాగులు, ఫైట్ సీన్స్‌లో తన ఇంటెన్సిటీ అన్నీ యాక్షన్ లవర్స్‌కు ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి.

డైరెక్టర్‌గా పరిచయమవుతున్న యాక్టర్..
వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో ‘ఆదికేశవ’ నాలుగవ చిత్రంగా తెరకెక్కింది. ఇటీవల తన డెబ్యూ చిత్రం ‘ఉప్పెన’కు నేషనల్ అవార్డ్ రావడంతో అదే రేంజ్‌లో ‘ఆదికేశవ’ కూడా హిట్ అవ్వాలని వైష్ణవ్ ఆశిస్తున్నాడు. పలు తెలుగు చిత్రాల్లో కమెడియన్‌గా కనిపించిన శ్రీకాంత్ ఎన్ రెడ్డి.. ‘ఆదికేశవ’లాంటి యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేశాడు. తాజాగా ‘మ్యాడ్’ చిత్రంలో సూపర్ సీనియర్‌గా నటించి యాక్టర్‌గా హిట్ కొట్టిన శ్రీకాంత్.. డైరెక్టర్‌గా తానేంటో అని ప్రేక్షకులకు నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. చాలాకాలం తర్వాత ‘ఆదికేశవ’తో టాలీవుడ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడు జీవి ప్రకాశ్. కేవలం లవ్ ట్రాక్‌కు మాత్రమే కాదు.. యాక్షన్ ఎపిసోడ్స్‌కు కూడా తను అందించిన సంగీతం బాగుందని ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Also Read: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు - అది కాంప్లిమెంట్ అని చెప్పిన మన్సూర్ అలీ ఖాన్ - వైరల్ గా మారిన పోస్ట్!

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Embed widget