Mansoor Ali Khan Trisha Controversy: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు - అది కాంప్లిమెంట్ అని చెప్పిన మన్సూర్ అలీ ఖాన్ - వైరల్ గా మారిన పోస్ట్!
Mansoor Ali Khan : లియో మూవీ యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
Leo Movie Actor Mansoor Ali Khan: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పై 'లియో' మూవీ యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన వల్గర్ కామెంట్స్ ఎంత పెద్ద వివాదంగా మారాయో తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది. తనపై చేసిన వ్యాఖ్యలను త్రిష ఖండించింది. ఆమెతోపాటు లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, సీనియర్ నటి కుష్బూ, సింగర్ చిన్మయి, మంత్రి రోజా తదితరులు తప్పు పట్టారు. అయితే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందిస్తూ తన వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశాన్ని తెలిపారు మన్సూర్ అలీ ఖాన్.
త్రిష గురించి మన్సూర్ అలీ ఖాన్ ఏం చెప్పారంటే..
" లియో మూవీలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను ఆమెను బెడ్ రూమ్ కి తీసుకెళ్లాలి అనుకున్నాను. త్రిష తో బెడ్ రూమ్ సీన్స్ సీన్ ఉంటుంది అనుకున్నాను. గతంలో చాలామంది హీరోయిన్స్ తో నేను రేప్ సీన్స్ చేశాను. లియో కాశ్మీర్ సెట్స్ లో త్రిషను అసలు నాకు చూపించలేదు" అని అన్నాడు మన్సూర్ అలీ ఖాన్. దీనిపై త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.." ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనేందుకు ఆనందంగా ఉంది. ఇకపై జీవితంలో అతడితో నటించను. మానవజాతికి మన్సూర్ అలీ ఖాన్ అవమానం" అని ట్వీట్ చేసింది.
త్రిషకు కాంప్లిమెంట్స్ ఇచ్చింది చూపించలేదు
తాజాగా తన వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు."నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎడిట్ చేసి కొన్ని మాటలు తొలగించారు. లియో మూవీలో ఆమె పాత్ర కీలకం. పర్వతాన్ని ఎత్తిన హనుమంతుడితో ఆమెను పోల్చాను. త్రిష కు నేను ఇచ్చిన కాంప్లిమెంట్స్ చూపించలేదు" అని అన్నాడు. అంతేకాకుండా తాజాగా సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ సందేశం రాస్కొచ్చాడు.
మన్సూర్ అలీ ఖాన్ సుధీర్ఘ పోస్ట్
" నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. నా కెరియర్ ని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. నేను గతంలో చాలామంది హీరోయిన్స్ తో కలిసి పని చేశాను. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు" అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు మన్సూర్ అలీ ఖాన్. దీంతో ఆ పోస్ట్ వైరల్ అవ్వగా ఆయన ఇచ్చిన వివరణ పై కూడా కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
మన్సూర్ అలీ ఖాన్ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు.." మొదట తప్పు చేసి ఆ తర్వాత తనను తాను సమర్థించుకుంటున్నాడని", "ఈడొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేస్తే బాగుంటుందని", "హీరోయిన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పకుండా దాన్ని సమర్ధించుకోవడం ఇంకా పెద్ద తప్పు" అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇప్పటికైనా మన్సూర్ అలీ ఖాన్ తేరుకొని త్రిషకు క్షమాపణ చెబుతాడో లేదో చూడాలి.
Also Read : 'లియో' ఓటీటీ రిలీజ్ లో భారీ ట్విస్ట్ - రెండు తేదీలను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్!