అన్వేషించండి

Leo OTT Release : 'లియో' ఓటీటీ రిలీజ్ లో భారీ ట్విస్ట్ - రెండు తేదీలను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్!

Leo Movie : దళపతి విజయ్ నటించిన 'లియో' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Leo OTT Release : కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'(Leo) ఓటీటీ రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సంస్థ 'లియో' ఓటీటీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 'లియో' మూవీకి ఏకంగా రెండు తేదీలను ప్రకటించడం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. 'విక్రమ్' మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ తో తెరకెక్కించిన రెండవ చిత్రం 'లియో'. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మాస్టర్'(Master) మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా దసరా కానుకగా విడుదలైన 'లియో' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన లియో అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపింది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.140 కోట్ల భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని కోలీవుడ్లో ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే లియో ఓటీటీ రిలీజ్ కోసం తలపతి ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ రిలీజ్ కంటే ముందు ఆన్ లైన్ ఈ మూవీ లీక్ అవ్వడంతో అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని, నవంబర్ 16 నుంచి ఈ మూవీ ఓటీటీ లోకి రాబోతుందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కానీ నవంబర్ 16న 'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాలేదు. దీంతో సినీ లవర్స్ నిరాశకు లోనయ్యారు. ఇలాంటి క్రమంలోనే తాజాగా నెట్ ఫ్లిక్స్ 'లియో' ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడంతో పాటూ ఎవరూ ఊహించని విధంగా ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది. అదేంటంటే, ఈ సినిమాకు సంబంధించి రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించింది. దాని ప్రకారం ఇండియాలో 'లియో'' నవంబర్ 24 న ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఇక గ్లోబల్ వైడ్ గా మాత్రం నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు అనౌన్స్ చేసింది. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

కాగా లియో ఓటీటీ రైట్స్ ని సుమారు రూ.120 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, అర్జున్, మడోనా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్, మిస్కిన్, శాండీ, మాథ్యూ ఇతర కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు.

Also Read : 'గూఢచారి' సీక్వెల్ లో హీరోయిన్ గా బనితా సంధు - లండన్ బ్యూటీతో అడివి శేష్ రొమాన్స్!

టాప్ హెడ్ లైన్స్

Crazy Kalyanam OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న అనుపమ క్రేజీ కల్యాణం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న అనుపమ క్రేజీ కల్యాణం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ramayana Collections : రామాయణ వీకెండ్ కలెక్షన్స్ - దీపావళికి సల్మాన్ మూవీ రికార్డ్ బ్రేక్... 500 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్
రామాయణ వీకెండ్ కలెక్షన్స్ - దీపావళికి సల్మాన్ మూవీ రికార్డ్ బ్రేక్... 500 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్
Dharman Ram Pothineni : రజనీ కాంత్ 'ధర్మన్'లో రామ్ పోతినేని - పవర్ ఫుల్ యాటిట్యూడ్‌కు గ్రాండ్ వెల్‌కమ్
రజనీ కాంత్ 'ధర్మన్'లో రామ్ పోతినేని - పవర్ ఫుల్ యాటిట్యూడ్‌కు గ్రాండ్ వెల్‌కమ్
Vrushakarma Songs : సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget