Sunny Leone: ఒడిశాలో ఆ బిజినెస్ ప్రారంభించిన సన్నీ లియోన్
Sunny Leone: చాలామంది ఇతర స్టార్ హీరోయిన్లలాగానే సన్నీ లియోన్ కూడా ‘స్టార్ స్ట్రక్’ అనే కాస్మటిక్ బ్రాండ్‌ను ప్రారంభించింది. తాజాగా ఈ బ్రాండ్ ఒడిశాలో లాంచ్ అయ్యి అక్కడి మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది.
Sunny Leone Star Struck in Odisha: ఈరోజుల్లో సినీ పరిశ్రమలో స్టార్లుగా వెలిగిపోతున్న చాలామందికి సొంత బ్రాండ్స్ ఉంటున్నాయి. ఏదో ఒక వ్యాపారంలో తమకంటూ సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసుకొని అక్కడ కూడా సక్సెస్ సాధిస్తున్నారు నటీనటులు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమకంటూ సొంతంగా ఒక కాస్మటిక్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో సన్నీ లియోన్ కూడా యాడ్ అయ్యింది. సన్నీ లియోన్.. చాలాకాలం క్రితమే ‘స్టార్ స్ట్రక్’ అనే కాస్మటిక్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల.. ఈ బ్రాండ్ సక్సెస్ సాధించింది. ఇక తాజాగా ఈ బ్రాండ్‌ను ఒడిశానులోని భువనేశ్వర్‌లో లాంచ్ చేసింది సన్నీ.
అక్కడే అందుబాటులో..
సన్నీ లియోన్ ప్రారంభించిన ‘స్టార్ స్ట్రక్’ ఇప్పటికే దుబాయ్, అబుదాబి, లండన్, ముంబాయ్ వంటి ప్రదేశాల్లో మంచి సక్సెస్‌ను అందుకుంది. కొన్నిరోజుల క్రితం ఈ బ్రాండ్‌ను బెంగుళూరులో కూడా ప్రవేశపెట్టింది. ప్రజలకు ఈ బ్రాండ్‌ను మరింత దగ్గర చేయడం కోసం తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో ‘స్టార్ స్ట్రక్’ను లాంచ్ చేసింది సన్నీ లియోన్. ఒడిశాలో సుకృతి పట్నాయక్‌కు చెందిన ఇండల్జ్ అనే సెలూన్‌లో ‘స్టార్ స్ట్రక్’ లాంచ్ జరిగింది. ఇక ఇప్పటినుండి ఇండల్జ్ సెలూన్‌లోనే ఈ కాస్మటిక్ బ్రాండ్ అందుబాటులోకి ఉండనుంది. ‘స్టార్ స్ట్రక్’ అనేది ఏ రకమైన చర్మాన్ని అయినా అందంగా చూపించడానికి ఉపయోగపడుతుందని సన్నీ లియోన్ తెలిపింది.
ఒడిశా మార్కెట్‌లో అడుగు..
స్కిన్ టోన్ ఎలా ఉన్నా.. వారి వయసు ఎంత అయినా.. ‘స్టార్ స్ట్రక్’ను ఉపయోగించడం చాలా సేఫ్ అని సన్నీ లియన్ హామీ ఇచ్చింది. ఒడిశాలో జరిగిన ఈ లాంచ్‌లో సన్నీ లియోన్‌తో పాటు తన భర్త డేనియల్ వెబెర్ కూడా పాల్గొన్నారు. ఇండల్జ్ సెలూన్‌ను స్థాపించిన తర్వాత సుకృతి పట్నాయక్‌కు ఒడిశా మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. అలాంటి ఒక బిజినెస్ ఉమెన్‌తో చేతులు కలిపింది కాబట్టి సన్నీ లియోన్ ‘స్టార్ స్ట్రక్’ బ్రాండ్ కూడా ఒడిశా మార్కెట్‌లో దూసుకుపోతుందని నిపుణులు భావిస్తున్నారు.
View this post on Instagram
సినిమాలతో బిజీ..
సినిమాల విషయానికొస్తే.. సన్నీ లియోన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ అన్నీ సైలెంట్‌గా పూర్తి చేసేసుకుంటోంది. ఒకప్పుడు తనకు హిందీలో మాత్రమే సినిమా అవకాశాలు వచ్చేవి. కానీ గత కొంతకాలంగా సౌత్‌లో కూడా బిజీ అయిపోయింది ఈ భామ. తను చివరిగా ‘మృదు భావే ధృడ కృత్యే’ అనే మలయాళ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కనిపించి అలరించింది. ఇక త్వరలోనే ‘రంగీలా’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఒక నటిగా పూర్తిస్థాయిలో మాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానుంది. దీంతో పాటు పలు సినిమాల్లో తను కీలక పాత్రల్లో కూడా కనిపించనుంది.
Also Read: దిశా పటానీ ఒంటిపై టాటూ - ప్రభాస్ కోసమే అంటున్న ఫ్యాన్స్