అన్వేషించండి

Sunny Leone Insta Post : సన్నీ లియోన్ మంచి మనసు - అనుష్క ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు రివార్డ్!

బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ మరోసారి తన మంచి మనసు చాటుకుంది. తన ఇంట్లో పని చేసే వ్యక్తి కూతురు తప్పిపోవడంతో ఆమె ఆచూకీ తెలిపిన వారికి యాబై వేల రూపాయలను రివార్డ్​గా ప్రకటించింది.

Sunny Leone Insta Post : బాలీవుడ్ నటి సన్నీలియోన్​కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ముందుకెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. ఈమధ్య కాలంలో పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్​గా ఉంటూ నచ్చిన అంశాలపై స్పందిస్తూ ఉంటుంది సన్నీ. ఇదిలా ఉంటే సన్నీలియోన్ మరోసారి తన మంచి మనసు చాటుకుంది. ముంబైకి చెందిన ఓ చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేకంగా తానే స్వయంగా 50 వేల రూపాయలు రివార్డ్ ఇస్తానని తెలిపింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టాగ్రామ్​లో పంచుకుంది. దీంతో సన్నీ లియోన్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

డీటెయిల్స్​లోకి వెళ్తే.. సన్నీలియోన్ తన ఫ్యామిలీతో ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. తన ఇంట్లో కిరణ్ మోరే అనే వ్యక్తి పని చేస్తున్నారు. అతనికి అనుష్క అనే తొమ్మిదేళ్ల కూతురు ఉంది. ఈనెల 8వ తేదీ సాయంత్రం ఏడు గంటల సమయంలో ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో అనుష్క తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఎవరైనా బాలిక ఆచూకీ తెలిపితే 11,000 రూపాయలు పారితోషకం ఇస్తామని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంట్లో పని చేసిన వ్యక్తి కూతురు తప్పిపోయిందనే విషయం తెలుసుకున్న సన్నీలియోన్ స్వయంగా ఆ చిన్నారి కోసం తన మంచి మనసును చాటుకుంది.

ఈ మేరకు బాలిక సమాచారాన్ని ఇచ్చిన వారికి తానే స్వయంగా 50 వేల రూపాయలు ఇస్తానని సన్నీలియోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్​లో షేర్ చేస్తూ ఆ బాలిక ఫోటోతో పాటు చిరునామా, ఫోన్ నెంబర్ తదితర వివరాలను షేర్ చేసింది. దీంతో సన్నిలియోన్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ 'దేవుడా ఎలాగైనా ఆ బాలికను రక్షించు' అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే సన్నీలియోన్ మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా చిన్నారి అనుష్క తల్లిదండ్రులు సుమారు రెండు రోజులుగా ఆమెను వెతుకుతున్నారు.

ఇప్పటివరకు అనుష్క ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తమ కూతురికి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సన్నీలియోన్ ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకోవడంపై పలువురు ఆమెను అభినందిస్తున్నారు. ఇక సన్నీ లియోన్ విషయానికొస్తే.. అనుకోకుండా పోర్న్ స్టార్​గా మారి.. 2011 లో హిందీ బిగ్ బాస్​లో పాల్గొన్నది. ఆ తర్వాత ఆమెకు విపరీతమైన పాపులారిటీ రావడంతో ఆమెకు బాలీవుడ్లో మంచి అవకాశాలు వచ్చాయి. సినిమాలతో పాటు బాలీవుడ్​లో పలు ఐటమ్ సాంగ్స్​తో భారీ క్రేజ్ తెచ్చుకున్న సన్నిలియోన్ ఈ మధ్యకాలంలో తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్ టైమ్స్​లో మంచు విష్ణు సరసన 'జిన్నా' మూవీలో నటించి ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్లో సన్నిలియోన్ చివరిసారిగా అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన 'కెనడీ' మూవీలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్​తో పాటు సౌత్ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

Also Read : గౌతమ్​కి థ్యాంక్స్ చెప్పిన యావర్ అన్నయ్య - అమ్మ ప్రేమ తెలియదంటూ ఏడ్చేసిన అన్నదమ్ములు, ఓదార్చిన శివాజీ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget