Ooru Peru Bhairava Kona: ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్ రివీల్ - ఎప్పుడంటే?
Ooru Peru Bhairava Kona: సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్‌ను ఎట్టకేలకు రివీల్ చేశారు మేకర్స్.
Ooru Peru Bhairava Kona Release Date: కొంతమంది యంగ్ హీరోలు ఎంత కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించినా.. కొన్నిసార్లు వారికి లక్ కలిసి రావడం లేదు. ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. స్పోర్ట్స్ డ్రామా నుండి హారర్ వరకు అన్ని జోనర్లు ట్రై చేసినా ఒక్కదాంట్లో కూడా సందీప్‌కు బ్లాక్‌బస్టర్ దక్కలేదు. ఇప్పటివరకు సందీప్ కెరీర్‌లో ఎక్కువగా యావరేజ్ హిట్లు, సూపర్ హిట్లు మాత్రమే ఉన్నాయి. అందుకే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈసారైనా బ్లాక్‌బస్టర్‌ను కొట్టాలని డిసైడ్ అయ్యాడు. తన అప్‌కమింగ్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
‘నిజమేనే చెబుతున్న జానే జాన’..
వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన చిత్రమే ‘ఊరు పేరు భైరవకోన’. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా ఇప్పటివరకు దీని విడుదలకు ముహూర్తం ఖరారు కాలేదు. పైగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా చాలా సమయం పట్టింది. అదే సమయంలో ‘ఊరు పేరు భైరవకోన’లోని సిడ్ శ్రీరామ్ పాడిన ‘నిజమేనే చెబుతున్న జానే జాన’ అనే పాటను విడుదల చేసి సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేశారు మేకర్స్. ఇప్పటికీ ఈ పాట చాలామంది మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. పాట వల్ల మూవీపై కాస్త హైప్ కూడా క్రియేట్ అయ్యింది. ఇక ఫైనల్‌గా సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.
కలిసి రెండోసారి..
2024 ఫిబ్రవరీ 9న ‘ఊరు పేరు భైరవకోన’ థియేటర్లలో విడుదలవుతుందని సందీప్ కిషన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ మూవీలో హీరోయిన్లుగా వర్ష బొల్లామా, కావ్యా థాపర్ నటిస్తున్నారు. ఈ ముగ్గురు ఉన్న ఒక కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ రిలీజ్ డేట్ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు హీరో. ఇప్పటికే వీఐ ఆనంద్, సందీప్ కిషన్ కాంబినేషన్‌లో 2015లో ‘టైగర్’ అనే మూవీ రిలీజ్ అయ్యింది. అది యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరూ ‘ఊరి పేరు భైరవకోన’ కోసం చేతులు కలిపారు. ఈ గ్యాప్‌లో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు వీఐ ఆనంద్. అందులో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
View this post on Instagram
‘ఊరు పేరు భైరవకోన’పైనే ఆశలు..
ఇక యంగ్ హీరో సందీప్ కిషన్ చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 2023లో తన ఫోకస్ అంతా ‘మైఖేల్’ సినిమాపైనే పెట్టాడు. దానికోసం పూర్తిగా మేక్ ఓవర్ అయ్యాడు. అయినా కూడా లాభం లేకపోయింది. థియేటర్లలో ‘మైఖేల్’ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇక దానికంటే ముందు విడుదలయిన చాలావరకు సినిమాలు కూడా యావరేజ్ టాక్‌నే అందుకున్నాయి. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఊరు పేరు భైరవకోన’పై పెట్టుకున్నాడు సందీప్. ఈ మూవీతో కన్నడ సూపర్‌హిట్ మూవీ ‘దియా’ ఫేమ్ ఖుషీ.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. హర్ష చెముడు, వెన్నెల కిషోర్‌లాంటి వారు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. శేఖర్ చంద్ర అందించిన సంగీతానికి ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ఫిదా అయ్యారు.
Also Read: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రవితేజ 'ఈగల్' సినిమాకి సోలో రిలీజ్ దక్కేనా?