Suhas: గాయకుడిగా మారిన సుహాస్... ఇది గల్లీ స్టెప్... మాంచి తీన్ మార్ సాంగ్‌తో జోష్‌ఫుల్‌గా...
Oh Bhaama Ayyoo Rama: సుహాస్ హీరోగా నటించిన తాజా సినిమా 'ఓ భామ అయ్యో రామ'. ఇందులో 'గల్లి స్టెప్' లిరికల్ వీడియో ఇవాళ విడుదలైంది. దీని స్పెషాలిటీ ఏమిటంటే... ఇది పాడింది సుహాస్.

సుహాస్ వెర్సటైల్ యాక్టర్. యూట్యూబ్ ఫిల్మ్స్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి... కొన్ని సినిమాల్లో హీరోలకు స్నేహితుడిగా నటించి... ఇప్పుడు సోలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఆయన వెర్సటైల్ యాక్టర్ మాత్రమే కాదు... మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. నటుడిగా తన ప్రతిభ చూపించిన ఆయన... ఇప్పుడు గాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
గల్లీ స్టెప్... పక్కా మాస్ సాంగ్ రామ!
సుహాస్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఓ భామ అయ్యో రామ'. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇందులో మాళవిక మనోజ్ హీరోయిన్. మలయాళ సినిమా 'జో' పాపులరైన ఆ అమ్మాయి... ఈ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతోంది. రామ్ గోధల దర్శకత్వంలో వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మించిన చిత్రమిది. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి తాజాగా 'గల్లి స్టెప్' లిరికల్ వీడియో విడుదలైంది.
'గల్లీ స్టెప్...' సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే... ఈ పాటను సుహాస్ పాడారు. రథన్ అందించిన పక్కా మాస్ బాణీకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆ పాట ఎలా ఉందో చూడండి.
'గల్లీ స్టెప్' సాంగ్ విడుదల చేసిన సందర్భంగా నిర్మాత హరీష్ నల్లా మాట్లాడుతూ... ''ఈ మాస్ సాంగ్ ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటుంది. ప్రతి గల్లిలో కుర్రాళ్లు తీన్ మార్ ఆడేలా పాటను రూపొందించారు. రథన్ సంగీతంలో సుహాస్ అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ సన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇదొక క్యూట్, లవ్లీ, రొమాంటిక్ ఫిల్మ్. ఇందులో సుహాస్, మాళవిక మధ్య లవ్ సీన్స్ అందరినీ అలరిస్తాయి. మా హీరో సుహాస్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. రథన్ ఆరు సాంగ్స్ ఇచ్చారని, ఏ పాటకు ఆ పాట డిఫరెంట్ గా ఉంటుందని దర్శకుడు రామ్ తెలిపారు. తమ నిర్మాత హరీష్ నల్లా ఖర్చుగా రాజీ పడకుండా తీశారని వివరించారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఓ అతిథి పాత్ర చేశారు.
Also Read: విరాటపాలెం వెబ్ సిరీస్ రివ్యూ: కొత్త పెళ్లి కూతుళ్లే టార్గెట్... అమ్మవారి శాపమా? ఆస్తుల కోసం కుట్రా?





















