అన్వేషించండి

Viraatapalem Web Series Review - విరాటపాలెం వెబ్ సిరీస్ రివ్యూ: కొత్త పెళ్లి కూతుళ్లే టార్గెట్... అమ్మవారి శాపమా? ఆస్తుల కోసం కుట్రా?

OTT Review - Viraatapalem Series On Zee5: అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో 'రెక్కీ' దర్శక నిర్మాతలు పోలూరు కృష్ణ, శ్రీరామ్ చేసిన కొత్త సిరీస్ 'విరాటపాలెం'. 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతోంది.

Zee5 original series Viraatapalem review in Telugu: 'జీ5' ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'. జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. టీజర్, ట్రైలర్ సిరీస్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. అయితే... తమ కథను కాపీ చేశారని ఈటీవీ విన్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' మేకర్స్ ఆరోపించడం వల్ల మరింత ప్రచారం లభించింది. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో 'రెక్కీ' దర్శక నిర్మాతలు పోలూరు కృష్ణ, శ్రీరామ్ తీసిన ఈ సిరీస్ ఎలా ఉంది? 

కథ (Viraatapalem Zee5 series Story): ఒంగోలులోని 'విరాటపాలెం' గ్రామంలో పెళ్లి పీటల మీద అమ్మాయి రక్తం కక్కుకుని మరణిస్తుంది. ఒకరి తర్వాత మరొకరు... ఆ విధంగా ప్రాణాలు కోల్పోతారు. పెళ్లి పీటల మీద లేదంటే పెళ్లైన గంటల్లో నవ వధువు నోటి నుంచి రక్తం రావడం, మరణించడం జరుగుతుంది. దాంతో కొందరు ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోతారు. ఊరిలో ఉన్న ఇంకొందరు తమ పిల్లలకు పెళ్లి చేయాలని అనుకుంటే... వేరే ప్రాంతాలకు వెళ్లి పెళ్లి జరిపించడం అక్కడ కాపురం పెట్టిస్తారు.

మూఢ నమ్మకాలు లేని మీనా (అభిజ్ఞ వూతలూరు) విరాటపాలెంకు పీసీ (పోలీస్ కానిస్టేబుల్)గా వస్తుంది. తండ్రి, తాత ముత్తాతలు ఉన్న ఇంటిని విడిచి వెళ్లడానికి ఇష్టం లేని ఓ అబ్బాయి ఆ ఊరిలో వేశ్యను పెళ్లి చేసుకుంటాడు. మర్నాడు ఆ అమ్మాయి మరణిస్తుంది. కళ్ల ముందు ప్రాణం పోవడం చూసి చలించిపోయిన మీనా, ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తుంది. మీనా ధైర్య సాహసాలు చూసిన ప్రెసిడెంట్ (రామరాజు) తన కొడుక్కి ఇచ్చి, అదీ తమ ఇంటిలో పెళ్లి చేయడానికి రెడీ అవుతాడు.

ఊరికి శాపం లేదని, పెళ్లి కుమార్తెల మరణాల వెనుక ఎవరో చేస్తున్న కుట్ర ఉందని విరాటపాలెం ఊరి ప్రజలు అందరికీ నిరూపించాలని ప్రయత్నించినా మీనా బతికిందా? మరణించిందా? అమ్మవారి శాపం నిజమా? అబద్ధమా? ఒకవేళ నిజం అయితే అమ్మవారి పేరుతో పెళ్లి కుమార్తెల ప్రాణాలు తీసింది ఎవరు? మీనాకు సాయం చేసిన టీ కొట్టు కిట్టు (చరణ్ లక్కరాజు) ఎవరు? చివరకు ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Viratapuram PC Meena Reporting Review In Telugu): ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ రెక్కీ... ఈ ఒక్క లైన్ ఓటీటీల్లో ప్రాజెక్ట్స్ ఫాలో అయ్యే రెగ్యులర్ ఆడియన్స్‌ చూపు 'విరాటపాలెం' మీద పడేలా చేసింది. పాలిటిక్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్, మర్డర్ అటెంప్ట్స్ వంటి అంశాలతో తీసిన 'రెక్కీ'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా తీశారు. 'విరాటపాలెం'కు వచ్చేసరికి డిజప్పాయింట్ చేశారు.

రొటీన్ సిరీస్ అయినా సరే దర్శక రచయితలు ఫాలో అయ్యే టెంప్లేట్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ చివరిలో నెక్స్ట్ ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి క్లిఫ్ హ్యాంగర్ ఇవ్వడం, మర్డర్ మిస్టరీ అయితే మిగతా పాత్రల మీద అనుమానం కలిగేలా సన్నివేశాలు తీయడం వంటివి. 'విరాటపాలెం' ప్రత్యేకత ఏమిటంటే... ఆ తరహా టెంప్లేట్ ఏదీ ఫాలో కాలేదు. ఓటీటీ వ్యూవర్స్ ఏం తీసినా చూస్తారులే అన్నట్టు తమకు నచ్చింది, తోచింది తీసుకుంటూ వెళ్లారు.

ఊరికి అమ్మవారి శాపం అని చెప్పారు. అసలు అమ్మవారు ఎందుకు శపించింది? అని ప్రశ్న వేసుకుంటే... సరైన సమాధానం లభించదు. అమ్మవారి శాపాన్ని తనకు అదృష్టంగా మార్చుకుని అర్ధకు, అణాకు ఆస్తులు కొంటున్నట్టు ఒకర్ని చూపించారు. ఆయన పాత్రలో బలం లేదు. 'నరసింహ'లో రమ్యకృష్ణ నీలాంబరి తరహాలో ప్రెసిడెంట్ కూతురు క్యారెక్టర్ డిజైన్ చేశారు. చివరకు ఆ ట్విస్ట్ కామెడీగా ఉంది. ఆడియన్స్‌ను 'టేకెన్ ఫర్ గ్రాంటెడ్'గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. కథలో బలం లేదు. ట్విస్టులు (దర్శక రచయితలు అనుకున్నవి) వర్కవుట్ అవ్వలేదు. 'వావ్' అనిపించే సీన్స్ గానీ, ఎపిసోడ్స్ గానీ లేవు. కథకు తగ్గట్టు మ్యూజిక్, ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నాయి. సిరీస్‌ను చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.

క్లైమాక్స్ అయితే మరీ టూ మచ్... అక్కడ రివీల్ చేసిన ఒక ట్విస్ట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. స్కూల్ కూడా కంప్లీట్ చేయని ఓ కుర్రాడి చేతికి పట్నంలో, అదీ కెమికల్ ల్యాబ్‌లో తయారు చేసే ఒక పౌడర్ ఎలా అందింది? అనేది అంతుచిక్కని ప్రశ్న. మినిమమ్ లాజిక్స్ కూడా పట్టించుకోరా!? అటువంటి సీన్స్ మేకర్స్ మీద రెస్పెక్ట్ పోయేలా చేస్తాయి. 

Also Read'8 వసంతాలు' రివ్యూ: ఎనిమిదేళ్లు గుర్తుంటుందా? 8 రోజులకు మర్చిపోతామా? ఫణీంద్ర నర్సెట్టి సినిమా హిట్టా? ఫట్టా?

'విరాటపాలెం'కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్... రన్ టైమ్! ప్రతి ఎపిసోడ్ 20 మినిట్స్ లోపే ఉంది. మైనస్ పాయింట్... ఆ 20 మినిట్స్ కూడా చూసే జనాలకు 30 మినిట్స్ కింద అనిపించడం! అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు నటన బావుంది. తమ పాత్రలకు న్యాయం చేయడానికి కృషి చేశారు. అయితే... రొటీన్ సీన్స్, వీక్ రైటింగ్ కారణంగా వాళ్ళూ ఏమీ చేయలేకపోయారు. రామరాజు, సురభి ప్రభావతి వంటి సీనియర్ టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ, ఒక్కటంటే ఒక్క సరైన సీన్ పడలేదు. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో సురభి ప్రభావతికి ఇంపార్టెన్స్ లభించినా... ఆ సీన్స్ ఏవీ ఇంపాక్ట్ చూపించలేదు. రెండు గంటల పాటు చూడటం కష్టమే.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్‌ లేవు... మరి సిరీస్ ఎలా ఉంది? నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 2 ఆకట్టుకుంటుందా?


PS: మెగాస్టార్ చిరంజీవికి పోలూరు కృష్ణ - శ్రీరామ్ వీరాభిమానులు అనుకుంట! లేదంటే 'కొండవీటి దొంగ' బాగా ఇష్టమైనా అయ్యి ఉండాలి. ఇప్పుడీ 'విరాటపాలెం', దీనికి ముందు తీసిన 'రెక్కీ'లోనూ చిరు పోస్టర్లు కనిపించాయి. కథలో టైమ్ పీరియడ్ ఎలివేట్ చేయడానికి 'కొండవీటి దొంగ' పోస్టర్లు వాడుకున్నారు. ఈసారి 'బొబ్బిలి రాజా'ను కూడా చూపించారు.

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Reliance in Kurnool: కర్నూలులో రిలయన్స్ భారీ పరిశ్రమ - రూ.1,622 కోట్లతో  బేవరెజెస్ యూనిట్  ఏర్పాటుకు అనుమతి
కర్నూలులో రిలయన్స్ భారీ పరిశ్రమ - రూ.1,622 కోట్లతో బేవరెజెస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి
Telangana Eagle:  తెలంగాణపై ఈగిల్ నిఘా - గంజాయి, డ్రగ్స్ పై బ్రహ్మాస్త్రం
తెలంగాణపై ఈగిల్ నిఘా - గంజాయి, డ్రగ్స్ పై బ్రహ్మాస్త్రం
Telangana Health Department Jobs: తెలంగాణ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర- 7వేల కొలువులకు నోటిఫికేషన్‌లు విడుదల!
తెలంగాణ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర- 7వేల కొలువులకు నోటిఫికేషన్‌లు విడుదల!
Akhanda Godavari: అఖండ గోదావరి ప్రాజెక్ట్ అంటే ఏంటీ?  రాజమండ్రి లో ఏం జరుగుతోంది?
అఖండ గోదావరి ప్రాజెక్ట్ అంటే ఏంటీ? రాజమండ్రి లో ఏం జరుగుతోంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kawal Tiger Reserve Villagers Problems | భూమి, పరిహారం కావాల్సిందే..లేదంటే పులి తిరిగే చోటుకే పోతాం | ABP Desam
Shubanshu Shukla First Speech from ISS | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాన్షు తొలి సందేశం | ABP Desam
Suryakumar Yadav Surgery | సూర్యకుమార్ కు స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ
Akhil
MLC Kavitha Comments on CM Revanth | రేవంత్ కు అభినందనలు తెలిపిన కవిత

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reliance in Kurnool: కర్నూలులో రిలయన్స్ భారీ పరిశ్రమ - రూ.1,622 కోట్లతో  బేవరెజెస్ యూనిట్  ఏర్పాటుకు అనుమతి
కర్నూలులో రిలయన్స్ భారీ పరిశ్రమ - రూ.1,622 కోట్లతో బేవరెజెస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి
Telangana Eagle:  తెలంగాణపై ఈగిల్ నిఘా - గంజాయి, డ్రగ్స్ పై బ్రహ్మాస్త్రం
తెలంగాణపై ఈగిల్ నిఘా - గంజాయి, డ్రగ్స్ పై బ్రహ్మాస్త్రం
Telangana Health Department Jobs: తెలంగాణ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర- 7వేల కొలువులకు నోటిఫికేషన్‌లు విడుదల!
తెలంగాణ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర- 7వేల కొలువులకు నోటిఫికేషన్‌లు విడుదల!
Akhanda Godavari: అఖండ గోదావరి ప్రాజెక్ట్ అంటే ఏంటీ?  రాజమండ్రి లో ఏం జరుగుతోంది?
అఖండ గోదావరి ప్రాజెక్ట్ అంటే ఏంటీ? రాజమండ్రి లో ఏం జరుగుతోంది?
Hyderabad Sweeti Couple : ఈ జంట లైవ్ శృంగారాన్ని చూడాలంటే రెండు వేలు కట్టాలట - ఇదేం యాపారం ?
ఈ జంట లైవ్ శృంగారాన్ని చూడాలంటే రెండు వేలు కట్టాలట - ఇదేం యాపారం ?
US military base: 80 దేశాల్లో అమెరికా మిలటరీ  బేస్‌లు - కానీ ఇండియాలో నో చాన్స్ -ఎందుకో తెలుసా ?
80 దేశాల్లో అమెరికా మిలటరీ బేస్‌లు - కానీ ఇండియాలో నో చాన్స్ -ఎందుకో తెలుసా ?
YSRCP News: తూర్పుగోదావరి జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నేతల తీరుపై శ్రేణులు ఆశ్చర్యం-  ఇలా జరగడానికి కారణమేంటీ?
తూర్పుగోదావరి జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నేతల తీరుపై శ్రేణులు ఆశ్చర్యం- ఇలా జరగడానికి కారణమేంటీ?
తెలంగాణలో పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల- tsecet.nic.inలో రిజల్ట్స్‌
తెలంగాణలో పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల- tsecet.nic.inలో రిజల్ట్స్‌
Embed widget