Prasanna Vadanam Trailer: ‘ప్రసన్నవదనం’ ట్రైలర్ - ముఖాలు గుర్తుపట్టలేని హీరోపై మూడు మర్డర్ కేసులు, భలే కొత్తగా ఉందే!
Prasanna Vadanam Trailer: మొదటిసారి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో రానున్నాడు సుహాస్. ‘ప్రసన్నవదనం’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది.
Prasanna Vadanam Trailer Out Now: ఈరోజుల్లో చాలామంది యంగ్ హీరోలు డిఫరెంట్ కథలు, ఎక్కువగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. అందులో సుహాస్ కూడా ఒకటి. ఇప్పటివరకు సుహాస్ హీరోగా నటించిన సినిమాలన్నీ హిట్లే. తను చేసిన ప్రతీ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పాయింట్‌ను తీసుకొని హిట్లు కొడుతుంటాడు ఈ హీరో. ఇప్పుడు ఏకంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాడు. అదే ‘ప్రసన్నవదనం’. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ట్రైలర్ చూస్తుంటే ఇందులో సుహాస్ స్టైల్ కామెడీతో పాటు క్రైమ్ డ్రామా కూడా ఉందని అర్థమవుతోంది.
కాంబినేషన్ రిపీట్..
‘‘సింపుల్‌గా చెప్పాలంటే ఫేస్ బ్లైండ్‌నెస్ అంటారు’’ అంటూ సూర్య (సుహాస్)కు ఉన్న వ్యాధి గురించి రివీల్ చేయడంతో ‘ప్రసన్నవదనం’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అప్పుడే తనను ఒక మహిళ పలకరించగా.. తన చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆమె ఎవరో గుర్తుపడతాడు మన హీరో. అలా ప్రతీ ఒక్కరిని గుర్తుపట్టడం కోసం తన దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటుంది. ‘కలర్ ఫోటో’ కాంబినేషన్ ‘ప్రసన్నవదనం’లో కూడా రిపీట్ అయ్యింది. ఇందులో కూడా సుహాస్ బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో వైవా హర్షనే నటించాడు. ‘‘నీకొక విషయం తెలుసా’’ అని హీరో చెప్పగానే ‘‘కొంపదీసి ఓనర్‌కు ఇవ్వాల్సిన పదివేలు వాచ్‌మ్యాన్‌కు ఇచ్చావా ఏంటి’’ అంటూ వైవా హర్ష ఇచ్చే కౌంటర్‌తో ఈ సినిమాలో కూడా వీరి ఫ్రెండ్‌షిప్ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది.
మధ్యలో ట్విస్ట్..
తనకు ఉన్న వ్యాధి వల్ల హీరోకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ట్రాఫిక్‌లో వైట్ షర్ట్ వేసుకొని ఒక వ్యక్తి దొంగతనం చేయగా.. వైట్ షర్ట్‌లోనే ఉన్న మరో వ్యక్తిని దొంగ అంటూ సుహాస్ ఫిక్స్ అయిపోతాడు. ‘ప్రసన్నవదనం’లో సుహాస్‌కు జోడీగా పాయల్ రాధాకృష్ణ నటించింది. హీరోకు సమస్య ఉందని తెలిసినా కూడా హీరోయిన్ తనను ప్రేమిస్తుందని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు మేకర్స్. అంతే కాకుండా ‘ప్రసన్నవదనం’ కోసం తన కెరీర్‌లో మొదటిసారి హీరోయిన్‌తో లిప్ లాక్ సీన్‌లో నటించాడు సుహాస్. ఇక ట్రైలర్ ఫస్ట్ హాఫ్ అంతా హీరోహీరోయిన్ల మధ్య గిల్లికజ్జాలతో, సుహాస్ కామెడీతో గడిచిపోతుంది. ‘‘ఇలాగే సాయం చేసుకుంటూ పో.. ఏదో ఒకరోజు పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కొని చస్తావు’’ అంటూ వైవా హర్ష చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మరో మలుపు తిరుగుతుంది.
చివరిగా ఎమోషనల్ టచ్..
ఒకరోజు హీరో కళ్ల ముందే ఒక మర్డర్ జరుగుతుంది. తనకు ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్నా సరే.. వెళ్లి పోలీసులకు ఈ విషయాన్ని చెప్తాడు సుహాస్. చివరికి తనే ఆ మర్డర్ కేసుల్లో ఇరుక్కుంటాడు. అలా ‘ప్రసన్నవదనం’ ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా ముందుకు సాగింది. ఇందులో కామెడీతో పాటు క్రైమ్ డ్రామా కూడా ఉందని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు మేకర్స్. చివరికి సుహాస్ స్టైల్ ఎమోషనల్ టచ్‌తో ఈ ట్రైలర్ ముగిసింది. ‘ప్రసన్నవదనం’లో హీరోయిన్ రాశి సింగ్ కూడా ఒక పోలీస్ పాత్రలో నటించింది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కొత్త కాన్సెప్ట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక మే 3న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.
Also Read: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ