Suhas: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ వచ్చేస్తుంది - ఈ వేసవిలో మోత మోగిపోవాల్సిందే!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో అడుగుపెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు నటుడు సుహాస్. సినిమాల మీద ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుహాస్..
Suhas: టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్స్ కు కొదవేం లేదు. ప్రతి ఏటా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే సినిమా రంగంలో నిలదొక్కుకోగలుగుతారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అయిన నటులు చాలా మందే ఉన్నారు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో అడుగుపెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు నటుడు సుహాస్. సినిమాల మీద ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుహాస్ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించారు. పలు సినిమాల్లో హీరోకు ఫ్రెండ్ పాత్రల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘కలర్ ఫోటో’ సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు సుహాస్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’.
ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు సుహాస్. సినిమా టైటిల్ ఫోటోను షేర్ చేస్తూ.. ఏప్రిల్ 11 న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్ట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీనితో పాటు ‘ఈ వేసవిలో మోత మోగిపోద్ది’ అంటూ రాసుకొచ్చారు. వాస్తవానికి ఈ సినిమా గురించి ఎప్పుడో వార్తలు వచ్చాయి. ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత సుహాస్ పలు సినిమాలు చేశారు కూడా. మొత్తానికి ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ తో మొదలుపెట్టి వేసవి వరకూ ఈ పబ్లిసిటీ ను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో దుశ్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర బృందం.
‘కలర్ ఫోటో’ సినిమాతో సుహాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలోని తన నటనతో ఎంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీకు జాతీయ స్థాయి అవార్డు దక్కడంతో అందరి చూపు సుహాస్ పై పడింది. ఆ తర్వాత సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’, ‘హిట్ 2’ వంటి చిత్రాల్లో నటించారు. ‘హిట్ 2’ సినిమాలో మెయిన్ విలన్ గా సినిమా చివరి పదినిమిషాల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు సుహాస్. దీంతో సుహాస్ కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ మూవీ తర్వాత ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘రైటర్ పద్మభూషణ్’ లో నటించారు. ఈ సినిమా మహిళా లోకాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. అంతే కాదు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఫ్రీ షో లు కూడా వేశారు. అంతగా ఈ సినిమా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు రాబోయే ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ తో ఎంతవరకూ ఆకట్టుకుంటారో చూడాలి.
View this post on Instagram