అన్వేషించండి

Jatadhara: కృష్ణుడు శివుడయ్యాడు.. ఘట్టమనేని ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన సుధీర్ బాబు

Jatadhara: నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘జటాధర’ టీమ్ ఘనమైన ట్రెబ్యూట్‌ని ఇచ్చింది. దేవుడిగా కృష్ణని కొలుస్తూ ఓ అద్భుతమైన పోస్టర్‌ని విడుదల చేసింది

Jatadhara: కృష్ణుడు శివుడు అవ్వడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. శివుడైనా, కృష్ణుడైనా పరమాత్ముడు ఒక్కరే. ఏ రూపంలో ఉన్నా, ఎన్ని పేర్లతో పిలిచినా భగవంతుడు ఒక్కరే అని అంతా భావిస్తుంటారు. ఇక కృష్ణుడిని శివుడిని చేశారనే విషయానికి వస్తే.. ఇక్కడ కృష్ణుడు ఎవరో కాదు.. నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. ఘట్టమనేని అభిమానులు ఎంతగానో అభిమానించే కృష్ణ, శివుని అవతారంలో కనిపిస్తే.. ఆ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. అదే ఆనందాన్ని ‘జటాధర’ చిత్రయూనిట్ ఘట్టమనేని అభిమానులకు, సూపర్ స్టార్ కృష్ణ బర్త్ యానివర్సరీ రోజు ఇచ్చారు. అవును, ఘట్టమనేని అభిమానులకు ఇది నిజంగా అదిరిపోయే ట్రీట్ అని చెప్పకతప్పదు.

మే 31 లెజండరీ యాక్టర్ సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌యంతి అనే విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పురస్కరించుకుని ‘జ‌టాధ‌ర’ చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ యాక్ట‌ర్‌కు హృద‌య‌పూర్వ‌కంగా నివాళులు అర్పించింది. నటశేఖర కృష్ణ తిరుగులేని చ‌రిష్మా, లార్జ‌ర్ దేన్ లైఫ్ స్క్రీన్ ప్రెజ‌న్స్.. ‘జటాధర’ టీమ్‌కి స్ఫూర్తినందిస్తూ క్రియేటివ్‌గా ముందుకు వెళ్ల‌టానికి తోడ్పాడునందిస్తుందని భావిస్తోంది. తెలుగు వెండితెర‌పై దేవుడిగా భావించే, సిల్వర్ స్క్రీన్ తుఫానుగా చూచే, సినిమా ప్ర‌పంచాన్ని ఎప్పటికీ ప్ర‌భావితం చేసే శ‌క్తిగా లెజండరీ యాక్ట‌ర్‌ సూప‌ర్‌స్టార్ కృష్ణను ‘జ‌టాధ‌ర’ చిత్ర‌యూనిట్ స్మ‌రించుకుంది. త‌మ క‌థ‌ల‌ను ఈ ప్ర‌పంచానికి అందించ‌టానికి కృషి చేస్తోన్న ఈ జ‌ట్టుకు ఆయ‌న చూపిన దారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంగా నిలుస్తుందని విశ్వసిస్తోంది. 

Also Readనన్ను రెచ్చగొట్టలేరు... నాన్న నుంచి నాకొచ్చిన ఆస్తి అది... 'కన్నప్ప' హార్డ్ డిస్క్ ఇష్యూలో మనోజ్ రెస్పాన్స్

‘హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చరిష్మా’ అంటూ సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆ లెజండరీ న‌టుడి చిర‌స్మ‌ర‌ణీయ ప్ర‌భావాన్ని శ్లాఘిస్తూ.. ఓ అద్భుతమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నటశేఖరుడు శివుని అవతారంలో దర్శనమిస్తున్నారు. ‘జటాధర’ టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేలా వచ్చిన ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కి మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ‘జ‌టాధర’ సినిమా షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ సినీ ప్ర‌యాణంలో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోనుందని యూనిట్ భావిస్తోంది. 

పాన్ ఇండియా మూవీగా సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘జ‌టాధర’ను తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, శిల్పా శిరోద్క‌ర్‌, ర‌వి ప్ర‌కాష్‌, ఇంద్ర కృష్ణ‌, న‌వీన్ నేని, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్సి వంటి వారంతా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేర‌ణ అరోరా, శివ‌న్ నారంగ్‌, అరుణ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. అక్ష‌య్ క్రేజీవాల్‌, కుస్సుమ్ అరోరా స‌హ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దివ్యా విజ‌య్ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, భ‌వానీ గోస్వామి సూప‌ర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చేలా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్ వెల్లడించారు.

Also Readతండ్రి సంవత్సరీకం తర్వాత నారా రోహిత్ పెళ్లి... హీరోయిన్ సిరి లేళ్లతో ఏడడుగులు వేసేది 2025లోనే... ఎప్పుడంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget