Nara Rohit Wedding: తండ్రి సంవత్సరీకం తర్వాత నారా రోహిత్ పెళ్లి... హీరోయిన్ సిరి లేళ్లతో ఏడడుగులు వేసేది 2025లోనే... ఎప్పుడంటే?
Nara Rohit Siri Lella Wedding: 'ప్రతినిధి 2' సినిమాలో తనకు జంటగా నటించిన సిరి తో నారా రోహిత్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది ఏడు అడుగులు వేయనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట ఈ ఏడాది పెళ్లి భాజాలు మోగుతాయి. నారా లోకేష్, బ్రాహ్మణి వివాహం అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది కదా! మరి, చంద్రబాబు ఇంట పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అంటే... నారా రోహిత్ (Nara Rohit)!
చంద్రబాబుకు నారా రోహిత్ కొడుకు వరుస. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్న కొడుకు రోహిత్ అనే సంగతి తెలిసిందే. రామ్మూర్తి నాయుడు గత ఏడాది మరణించడంతో తమ్ముడి కొడుకు పెళ్లి బాధ్యత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు తీసుకున్నారని తెలిసింది.
అక్టోబర్ 2025లో సిరితో రోహిత్ పెళ్లి!
'ప్రతినిధి 2'లో తనకు జంటగా నటించిన సిరి లేళ్ల (Siri Lella) అలియాస్ శిరీషతో నారా రోహిత్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. ఇరు కుటుంబాలలో పెద్దలను ఒప్పించి గత ఏడాది అక్టోబర్ నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు.
రోహిత్ తండ్రి, చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు గత ఏడాది నవంబర్ నెలలో కన్ను మూశారు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి మరణించిన ఏడాది వరకు కుమారుడి పెళ్లి చేయరు. అందువల్ల రోహిత్ పెళ్లి వాయిదా పడింది. రామ్మూర్తి నాయుడు సంవత్సరీకం పూర్తి అయ్యాక... ఈ ఏడాది అక్టోబర్ నెలలో సిరి లేళ్లతో నారా రోహిత్ ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యారు.
Also Read: బాలకృష్ణ బర్త్ డే స్పెషల్... థియేటర్లలోకి మళ్ళీ 'లక్ష్మీ నరసింహ'... ఎప్పుడో తెలుసా?
తమ పెళ్లి ఈ ఏడాది ఉంటుందని, అదీ అక్టోబర్‌లో ఏడు అడుగులు వేస్తామని 'భైరవం' సినిమా ప్రచార కార్యక్రమాలలో రోహిత్ తెలిపారు. అయితే ముహూర్తం ఎప్పుడు? అక్టోబర్ నెలలో ఏ తేదీన సిరి మెడలో మూడు మూడు వేస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
'భైరవం'తో మళ్లీ విజయం అందుకున్న రోహిత్!
'భైరవం' సినిమాలో మనోజ్ మంచు, సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో పాటు నారా రోహిత్ కూడా నటించారు. మల్టీస్టారర్ సినిమా అయినప్పటికీ ముగ్గురు హీరోలకు సమ ప్రాధాన్యం లభించింది. వరదా పాత్రలో నారా రోహిత్ నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాతో ఆయన మరో విజయం అందుకున్నారు.
'భైరవం' ప్రీమియర్ షోకు నారా రోహిత్‌తో పాటు సిరి లేళ్ల కూడా హాజరు అయ్యారు. సినిమా విషయం పట్ల ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్ కంటే ఎక్కువ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. 'భైరవం' విడుదలైన రోజున సిరి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇంట్లో కేక్ కట్ చేశారు. 'ప్రతినిధి 2' సినిమా తర్వాత సిరి లేళ్ల మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ'లో యాక్ట్ చేస్తున్నారు.





















